ఎర్రచందనం దుంగలు స్వాధీనం
తిరుపతి అన్నమయ్యసర్కిల్ : శ్రీకాళహస్తి మండలం ఆదవరం అటవీ పరిధిలో ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ఒక స్మగ్లరును టాస్క్‌ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. తీర్ధాలపాల కోన వద్ద కొంత మంది వ్యక్తులు గుమికూడి కనిపించగా వారిని పోలీసులు చుట్టుముట్టే ప్రయత్నం చేయగా పారిపోతున్న క్రమంలో ఒకరిని పట్టుకున్నారు. పట్టుబడిన స్మగ్లరు కర్ణాటకకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఆ పరిసరాల్లోని ఆరు ఎర్రచందనం దుంగలు, ఉపయోగించిన ద్విచక్ర వాహనం సహా తిరుపతి టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు.
సిద్ధార్థ్ ఇంజినీరింగ్ కాలేజీలో ఐడియాథాన్–2025
నారాయణవనం : తిరుపతి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్(ఆర్‌టిఐహెచ్) సహకారంతో సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం ఐడియాథాన్ –2025ను నిర్వహించారు. 90 మంది కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు పాల్గొని, తమ వినూత్న ఆలోచనలు, స్టార్టప్ ఐడియాలు, సాంకేతిక పరిష్కారాలను ప్రదర్శించారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆవిష్కరణాత్మక ఆలోచనలను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా నిర్వహించారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రతినిధులు సిల్వియా, వినోద్ కుమార్, వీరేంద్ర సాయి, శ్రీనివాస్ విద్యార్థుల ఆలోచనలను పరిశీలించి సూచనలు అందించారు. ప్రాజెక్టులు, ఆలోచనలపై మార్గదర్శకాలను వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాళ్లు మధు, జనార్దనరాజు, హెచ్‌వోడీలు, కంప్యూటర్ సైన్ విద్యార్థులు పాల్గొన్నారు.
బైక్ ఢీకొని వ్యక్తి మృతి
నాయుడుపేట టౌన్ : మండలంలోని చలివేంద్రం గ్రామ సమీపంలో బైక్ ఢీకొని గాయపడిన కల్లుగీత కార్మికుడు కన్నడి వెంకటయ్య(65) మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. చలివేంద్రం గ్రామానికి చెందిన వెంకటయ్య గురువారం సాయంత్రం గ్రామ సమీపంలో రోడ్డు పక్కగా నడిచి వెళుతున్నాడు. అదే సమయంలో వేగంగా వచ్చిన బైక్ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు తిరుపతికి రెఫర్ చేశారు. ఈ క్రమంలో మార్గమధ్యలో వెంకటయ్య మృతి చెందాడు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ వైద్యశాలలోని మార్చురీకి తరలించారు. సీఐ బాబి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఎర్రచందనం దుంగలు స్వాధీనం
ఎర్రచందనం దుంగలు స్వాధీనం


