మమ్మల్ని వీధిపాలు చేశారు
ఇప్పుడు ఉండేది మా తెలుగుదేశం ప్రభుత్వం.. మిమ్మల్ని కాపాడేది ఎవరు? అని పలుసార్లు ఖాదర్ బాషా అనే టీడీపీ కార్యకర్త బెదిరించారు. అతని మాటలు విని రెవెన్యూ అధికారులు మా ఇంటిని కూల్చివేశారు. మా ఇల్లు ప్రభుత్వ భూమిలో ఉందని అంటున్నారు. కానీ అదే టీడీపీ కార్యకర్త ఇల్లు కూడా మా పక్కనే వారు చెప్పే సర్వే నంబర్ లోనే ఉంది. అది ఎందుకు తొలగించ లేదు. అతను ఇచ్చే డబ్బులకు ఆశపడి మా కుటుంబాన్ని నడివీధి పాలు చేశారు.
– సాహిదా, బాధితురాలు కూతురు,
గురవరాజుపల్లి, రేణిగుంట మండలం


