మేయర్‌పై అవిశ్వాసం దారుణం | - | Sakshi
Sakshi News home page

మేయర్‌పై అవిశ్వాసం దారుణం

Dec 8 2025 8:12 AM | Updated on Dec 8 2025 8:12 AM

మేయర్

మేయర్‌పై అవిశ్వాసం దారుణం

చిల్లకూరు: నెల్లూరు కార్పొరేషన్‌ మేయర్‌ పొట్లూరి శ్రవంతిపై అవిశ్వాసం ప్రకటించడం దారుణమని గిరిజన సంఘాల నాయకులు మండిపడ్డారు. గూడూరు టవర్‌ క్లాక్‌ ప్రాంతంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఆదివారం గిరిజన సంఘాల నాయకులు కుటుంబాలతో కలసి వచ్చి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓ గిరిజన మహిళ నెల్లూరు కార్పొరేషన మేయర్‌గా ఉండడం అగ్ర వర్ణాల వారికి ఇష్టం లేక పోవడంతోనే ఇలా అవిశ్వాస తీర్మానం పెట్టారని దుయ్య బట్టారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు గిరిజనులకు అండగా ఉండి, వారి అభ్యున్నతిని కాంక్షిస్తామని ప్రకటనలు చేశారని, అలాంటి ఓ గిరిజన మహిళకు ప్రభుత్వంలోని పెద్దలు అన్యాయం చేస్తుంటే చూస్తూ ఊరుకోవడం తగదన్నారు. స్వార్థ రాజకీయాల కోసం గిరిజనలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కూడా కాపాడలేక పోవడం చూస్తుంటే అణగారిన వర్గాల వారు ఉన్నత పదవులను అలంకరించడం వారికి ఇష్టం లేనట్లు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. గిరిజన సంఘాల నాయకులు తిరువీధుల వాసు, వెంకటేష్‌, సుజాతమ్మ, గిరిజ తదితరులు పాల్గొన్నారు.

కాల్‌ సెంటర్‌ సేవలు వినియోగించుకోండి

తిరుపతి అర్బన్‌: మీ కోసం కాల్‌ సెంటర్‌ 1100 సేవలను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌. వెంకటేశ్వర్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు దాఖలు చేసిన తమ అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా, లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్‌కు కాల్‌ చేయవచ్చన్నారు. అర్జీదారులు వారి అర్జీలు నమోదు చేసుకోవడానికి (మీకోసం డాట్‌ ఏపీ డాట్‌ జీఓ వి డాట్‌ ఇన్‌) వెబ్‌సైట్‌లో అర్జీలు నమోదు చేసుకోవచ్చన్నారు. కాగా ఈ నెల 8వ తేదీ కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందన్నారు.

అంజూరులో టీడీపీ నేత అత్యుత్సాహం

కేవీబీపురం: మండలంలోని అంజూరు పంచాయతీలో టీడీపీ నే త అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నా రు. గత ప్రభుత్వంలో అంజూరు దళితవాడలో రూ.32 లక్షల ని ధులతో 900 మీటర్ల మురుగునీటి కాలువలను నిర్మించారు. ఈ పనులకు సంబఽంధించి ఆ గ్రామంలో దిమ్మె ఏర్పాటు చేసి, పనుల వివరాలను పొందుపరిచారు. అయితే ప్రస్తుతం అదే గ్రామానికి చెందిన ఓ టీడీపీ నేత రూ.5 లక్షలతో సిమెంటు రోడ్డు నిర్మాణం చేశారు. ఈ పనులకు సంబంధించి ప్రత్యేకంగా నేమ్‌ బోర్డు ఏర్పాటు చేయకుండా గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన నేమ్‌ బోర్డుపై వివరాలను తొ లగించి ప్రస్తుతం చేపట్టిన సిమెంటు రోడ్డు నిర్మాణ వివరాలను పొందుపరిచా రు. ఈ ఘటనను గ్రామస్తులు సురేష్‌, చెంగయ్య, సుబ్రమణ్యం, మురళి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన నేమ్‌ బోర్డును ఎలా చెరిపివేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇంజినీరింగ్‌ అధికారులు సైతం ఇలాంటి దుర్మార్గాలపై చర్యలు తీసుకోరా? అని అధికారులకు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు.

మేయర్‌పై అవిశ్వాసం దారుణం 1
1/1

మేయర్‌పై అవిశ్వాసం దారుణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement