స్కాలర్ షిప్ పరీక్షకు విశేష స్పందన
తిరుపతి సిటీ: నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ ఎగ్జామినేషన్ (ఎన్‌ఎమ్‌ఎమ్‌ఎస్) పరీక్షలకు విశేష స్పందన లభించిందని డీఈఓ కేవీఎన్ కుమార్ తెలిపారు. జిల్లాలో ఆదివారం 14 పరీక్షా కేంద్రాల్లో జరిగిన ఎన్‌ఎమ్‌ఎమ్‌ఎస్ స్కాలర్ షిప్ ఎంపిక పరీక్షకు 2,958 మంది నమోదు చేసుకోగా, అందులో 2,860మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. ఎటు వంటి మాల్‌ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించామని చెప్పారు.
వివాదస్పద భూమిపై ఏఎస్పీ, ఆర్డీఓ విచారణ
బుచ్చినాయుడుకండ్రిగ: మండలంలోని రెండు గ్రామాల మధ్య నెలకొన్న భూవివాదంపై ఏఎస్పీ రవిమనోహరచ్చారి, ఆర్డీఓ కిరణ్మయి ఆదివారం విచారణ చేపట్టారు. నీర్పాకోట రెవెన్యూ పరిధిలోని 87–9లో ఉన్న 29 సెంట్లు భూమికి సంబంధించి రెండు నెలక్రితం నీర్పాకోట, కాంపాళెం గ్రామస్తుల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆడిషనల్ ఎస్పీ, ఆర్డీఓ, వివాస్పద భూమిని పరిశీలించారు. అక్కడే ఇరువర్గాల వారిని విచారించి, వివరాలు సేకరించారు. దీనిపై ఆర్డీఓ కిరణ్మయి మాట్లాడుతూ వివాస్పద భూమి ప్రభుత్వ భూమి అని, ఎవరూ ప్రవేశించకూడదని హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి, సీఐ తిమ్మయ్య, తహసీల్దార్ శ్రీదేవి, ఎస్‌ఐ హరిప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
నేచురల్ బాడీ బిల్డింగ్‌లో
శ్రీకాళహస్తి వాసికి పసిడి పతకం
శ్రీకాళహస్తి: గోవాలో గత నెల 27 నుంచి 29వ తేదీ వరకు జరిగిన నేషనల్ నేచురల్ బాడీ బిల్డింగ్ పోటీల్లో శ్రీకాళహస్తికి చెందిన షేక్ జావిద్ బంగారు పతకం సాధించాడు. దీంతో ఆదివారం వై ఎస్సార్ సీపీ సంయుక్త కార్యదర్శి షేక్ సిరాజ్‌బాషా అతన్ని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణానికి చెందిన షేక్ జాబిద్ బంగారు పతకం సాధించడం ఆనందంగా ఉందన్నారు.రాష్ట్ర నేషనల్ హ్యూమన్‌రైట్స్ ఉపాధ్యక్షులు కామి వెంకటేశ్వర్లు, రమేష్, మాత య్య, లాలు, శంషుద్దీన్ పాల్గొన్నారు.
స్కాలర్ షిప్ పరీక్షకు విశేష స్పందన


