ముక్కంటి క్షేత్రం.. భక్త జనసంద్రం
వరదయ్యపాళెం: తెలుగుగంగ కాలువలో గల్లంతైన బాలుడు మహిత్ శవమై తేలాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. రెండో తరగతి చదువుతున్న బాలుడు మహిత్ ఆదివారం సాయంత్రం కారు కడిగేందుకు తన తాత బాబు వెంట ఉబ్బలమడుగు సమీపంలోని తెలుగుగంగ కాలువ వద్దకు వెళ్లి గల్లంతైన ఘటన తెలిసిందే. ఈ విషయమై బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం ఉదయం బీఎన్‌కండ్రిగ సీఐ తిమ్మయ్య, ఎస్‌ఐలు హరిప్రసాద్, మల్లికార్జున ఆధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బంది, ఎస్డీఆర్‌ఎఫ్ బృందం, పోలీసులు కాలువ వెంబడి గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ క్రమంలో ఉబ్బలమడుగు ప్రధాన ముఖద్వారం నుంచి సత్యవేడు వైపుగా వెళ్లే తెలుగుగంగ కాలువలో 120వ కి.మీ సమీపంలో బాలుడు మహిత్ మృతదేహం కాలువ అంచులో ఉన్న చెట్ల పొదల్లో ఇరుక్కుని ఉండగా అటుగా వెళ్లిన ఎస్డీఆర్‌ఎఫ్ బృందం గుర్తించింది. దీంతో వారి సహకారంతో బాలుడి మృత దేహాన్ని కాలువ గట్టుపై చేర్చారు. వివరాలు నమోదు చేసుకుని శవపంచనామా నిమిత్తం సత్యవేడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా బాలుడు మహిత్‌తోపాటు తెలుగుగంగ కాలువలో గల్లంతైన డ్రైవర్ షరీఫ్ ఆచూకీ లభ్యం కాలేదు.
ముక్కంటి క్షేత్రం.. భక్త జనసంద్రం
ముక్కంటి క్షేత్రం.. భక్త జనసంద్రం
ముక్కంటి క్షేత్రం.. భక్త జనసంద్రం


