జీవనోపాధికి ప్రశాంత సాగరం బాటలు వేస్తుంది. ప్రధానంగా మత
ప్రకృతి వైపరీత్యాల సమయంలో కష్టతరంగా పునరావాసం తలదాచుకునేందుకు తీర ప్రాంతవాసుల అవస్థలు ఆశ్రయం కల్పించేందుకు అధికారుల ఇక్కట్లు
అధికారుల నిర్లక్ష్యం
తుపాను వస్తోందనగానే ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు, సహాయక చర్యల నిమిత్తం రూ.కోట్లు విడుదల చేసి, ఖర్చు చేస్తుంది. ముంపు గ్రామాల్లో నివసించే వారికి ఆయా ప్రాంతాల్లోని పాఠశాలలు, కమ్యూనిటీ భవనాల్లో పునరావాసం కల్పిస్తుంది. ఇందుకు వెచ్చించే నిధుల్లో కొంత తుపాను రక్షిత భవనాలను సరిచేసేందుకు వినియోగిస్తే వేలాదిమందికి ప్రాణాలకు భరోసా ఉంటుంది. అత్యవసర పరిస్థితిల్లో తీరప్రాంతవాసులకు రక్షణ కల్పించేందుకు వెసులుబాటు ఉంటుంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వం విడుదల చేసే నిధులు కేవలం తాత్కాలిక సహాయానికే పరిమితమవుతున్నాయి.
వాకాడు మండలం అందలమాలలో కూలేందుకు సిద్ధంగా తుపాను రక్షిత భవనం
నాడు పదిలం..
చిల్లకూరు : జిల్లాలో సుమారు 75 కిటోమీటర్ల మేర సముద్ర తీరం విస్తరించి ఉంది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్‌లో తుపానులు, వాయుగుండాలు సంభవిస్తుంటాయి. ఈ క్రమంలోనే తీర ప్రాంతాల వాసులను ప్రకృతి వైపరీత్యాలు వణికిస్తుంటాయి. అలాంటి విపత్కర వేళల్లో దాదాపు 40 ఏళ్ల క్రితం తీర ప్రాంతంలోని మత్స్యకార గ్రామాలతోపాటుగా వాటికి అనుబంధ పల్లెల్లో తుపాన్ రక్షిత భవనాలు నిర్మించారు. ఇవి బాగా ఉన్న రోజుల్లో తుపానులు వస్తే ముంపు బాధితులు ఈ భవనాలలోకి వెళ్లి తల దాచుకునేవారు. అయితే కాలక్రమంలో ఆ భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రభుత్వాలు సైతం ఈ ఆలనా పాలనా పట్టించుకోకపోవడంతో కూలేందుకు సిద్ధంగా మారాయి. తీర ప్రాంత నియోజకవర్గాలైన గూడూరు, సూళ్లూరుపేటలోని సుమారు 48 తుపాను రక్షిత భవనాలు వినియోగానికి పనికిరాని విధంగా తయారయ్యాయి. వీటిని పర్యవేక్షించాల్సి పంచాయతీరాజ్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో భవనాలకు ఉన్న విలువైన కలప, కమ్మీలు, తలుపులు చోరీకి గురయ్యాయి. దీంతో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన తుపాను రక్షిత భవనాలు ప్రస్తుతం దిష్టిబొమ్మలా దర్శనమిస్తున్నాయి.
మత్స్యకారుల సామగ్రి భద్రతకు ఇబ్బందే!
సముద్రం మీదకు వేటకు వెళ్లే మత్స్యకారులు తమ వలలు, ఇంజిన్లు ఇతర సామగ్రిని తుపాను సమయంలో భద్రపరుచుకోవడం ఇబ్బందిగా మారింది. రక్షిత భవనాలుంటే సామగ్రిని భద్రంపరుచుకునేందుకు వీలుగా ఉండేది. ప్రస్తుతం అవి పూర్తిగా శిథిలావస్థలో ఉండడంతో పాఠశాలల్లోని పునరావాస కేంద్రాల్లో సామగ్రిని ఉంచుకునేందుకు స్థలం సరిపోవడం లేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి తుపాను రక్షిత భవనాలను వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు.
తుపాను రక్షిత భవనాలపై శీతకన్ను వేసిన ప్రభుత్వాలు
నివేదిక సిద్ధం చేస్తాం
తీర ప్రాంతంలోని గ్రామాల్లో శిథిలావస్థకు చేరిన తుపాను రక్షిత భవనాలపై నివేదిక సిద్ధం చేస్తాం. దీనిపై కలెక్టర్ సైతం ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మరమ్మతులు చేస్తే వినియోగంలోకి వచ్చేవాటిని ముందుగా గుర్తించి ఆ మేరకు ఎన్ని నిధులు ఖర్చు చేస్తే సరిపోతుందో నివేదికలో పొందుపరుస్తాం. మోంథా తుపాను ప్రభావం తగ్గిన తర్వాత క్షేత్రస్థాయిలో పర్యటించి రిపోర్టు తయారు చేసి పంపుతాం.
– రమణయ్య, డీఈఈ,
పంచాయతీరాజ్, గూడూరు, నాయుడుపేట
ప్రస్తుత పరిస్థితి మరీ దారుణం
మోంథా తుపాను విరుచుకుపడిన ఈ విపత్కర సమయంలో తీర ప్రాంతంలో ముంపు కాలనీల్లో ఉన్నవారికి పునరావసం కల్పించడం అధికారులకు తలకుమించిన భారమైంది. సాధారణంగా తీర ప్రాంతంలో చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి. అందుకే అక్కడ 30 నుంచి 50 మంది విద్యార్థులకు సరిపడేలా పాఠశాల భవనాలు నిర్మించి ఉన్నారు. ఆయా పాఠశాలలోఏ్ల ఎన్ని కుటుంబాలకు ఆశ్రయం కల్పించాలో అర్థం కాక అధికారులు సతమతమవుతున్నారు.
జిల్లాలో సముద్ర తీరం 75 కి.మీ.
నియోజకవర్గాలు: గూడూరు, సూళ్లూరుపేట
మత్స్యకార గ్రామాలు 58
అనుబంధ పల్లెలు 15
మొత్తం గ్రామాలు 73
తుపాన్ రక్షిత భవనాలు 54
వినియోగంలో లేనివి 48
జీవనోపాధికి ప్రశాంత సాగరం బాటలు వేస్తుంది. ప్రధానంగా మత
జీవనోపాధికి ప్రశాంత సాగరం బాటలు వేస్తుంది. ప్రధానంగా మత
జీవనోపాధికి ప్రశాంత సాగరం బాటలు వేస్తుంది. ప్రధానంగా మత
జీవనోపాధికి ప్రశాంత సాగరం బాటలు వేస్తుంది. ప్రధానంగా మత
జీవనోపాధికి ప్రశాంత సాగరం బాటలు వేస్తుంది. ప్రధానంగా మత
జీవనోపాధికి ప్రశాంత సాగరం బాటలు వేస్తుంది. ప్రధానంగా మత


