తుపాన్‌పై ఆందోళన వద్దు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు
తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్
తిరుపతి అర్బన్: మోంథా తుపాన్‌పై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వెంకటేశ్వర్ వెల్లడించారు. ఆయన సోమవారం కలెక్టరేట్ నుంచి మాట్లాడారు. జిల్లాలో మంగళ, బుధవారాలు వర్షాలు కురి సే అవకాశం ఉందని రాష్ట్ర వాతావరణ, విపత్తుల నియంత్రణ శాఖ రెడ్ అలెర్ట్‌ను ప్రకటించిందని చెప్పారు. ఈ క్రమంలో అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నామని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే పుకార్లను నమ్మవద్దని సూచించారు. అత్యవసర కమ్యూనికేషన్ కోసం మొబైల్ ఫోన్లను ఛార్జ్ చేసుకోవాలని, వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ ఉండాలని చెప్పారు. ప్రభుత్వ అధికారు లు సూచించిన వెంటనే సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని వెల్లడించారు. మీ పత్రాలు, సర్టిఫికెట్లు, విలువైన వస్తువులను వాటర్ ప్రూఫ్ కంటైనర్లు, కవర్లలో ఉంచుకోవాలన్నారు. ఎలక్ట్రికల్ మెయి న్ స్విచ్ ఆఫ్ చేయాలని, అన్ని ఎలక్ట్రికల్ ఉపకరణాలు, గ్యాస్ కనెక్షన్‌ను తొలగించాలన్నారు. తలుపులు, కిటికీలు మూసి ఉంచాలని హెచ్చ రించారు. ఇల్లు సురక్షితంగా లేకపోతే భారీ వర్షాలు కురవకముందే సురక్షితమైన షెల్టర్‌కు వెళ్లాలన్నారు. పాత భవనాలు, చెట్లు, విద్యుత్ వైర్లు స్తంభాల వద్ద ఉండకూడదని తెలిపారు. పశువులు, పెంపుడు జంతువులకు కట్టిన తాడును విప్పి వాటిని వదిలివేయాలని కోరారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకూడ దని సూచించారు. అత్యవసర సహాయ సమాచారం నిమిత్తం జిల్లా కలెక్టరేట్‌లోని కంట్రోల్ రూమ్‌తో పాటు తిరుపతి, శ్రీకాళహస్తి, గూడూ రు, సూళ్లూరుపేట ఆర్డీవో కార్యాలయాల్లో 24 గంటలు పని చేసేలా కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణలో 24/7 పనిచేసే టోల్ ఫ్రీ నంబర్లు : 112, 1070, 1800 425 0101 లకు కాల్ చేయవచ్చని జిల్లా కలెక్టర్ తెలిపారు.
కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌లో అధికారులు
జిల్లాకు రెడ్ అలెర్ట్
కంట్రోల్ రూమ్ నంబర్లు
జిల్లా కలెక్టర్ కార్యాలయం 0877-2236007
ఆర్డీఓ కార్యాలయం, తిరుపతి 7032157040
ఆర్డీఓ కార్యాలయం, శ్రీకాళహస్తి 8555003504
ఆర్డీఓ కార్యాలయం, గూడూరు
08624-252807, 8500008279
ఆర్డీఓ కార్యాలయం, సూళ్లూరుపేట 08623295345
తుపాన్‌పై ఆందోళన వద్దు


