కూటమికి బుద్ధి వచ్చేలా ప్రజాఉద్యమం | - | Sakshi
Sakshi News home page

కూటమికి బుద్ధి వచ్చేలా ప్రజాఉద్యమం

Oct 28 2025 8:42 AM | Updated on Oct 28 2025 8:42 AM

కూటమి

కూటమికి బుద్ధి వచ్చేలా ప్రజాఉద్యమం

పేదల ఆశలను అడియాశలు చేస్తున్న ప్రజాద్రోహి చంద్రబాబు పార్టీ ప్రచార కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖర్‌, ఎంపీ గురుమూర్తి, భూమన అభినయ్‌రెడ్డి

తిరుపతి మంగళం: దేశ రాజకీయ చరిత్రలో ఏ ప్రభుత్వంలో జరగని ప్రజాఉద్యమం కూటమి ప్రభుత్వంలో మొదలైందని వైఎస్సార్‌సీపీ ప్రచార కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు కాటమాను రాజశేఖర్‌ పేర్కొన్నారు. తిరుపతి బాలాజీకాలనీలోని ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో సోమవారం పార్టీ ప్రచార కమిటీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ హరిప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ చేపట్టారు. కోటి సంతకాల సేకరణలో వంద లాది మంది యువత, విద్యార్థులు పాల్గొని స్వచ్ఛందంగా సంతకాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా వైఎస్సార్‌సీపీ ప్రచార కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు కాటమాను రాజశేఖర్‌, తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, పార్టీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి, మేయర్‌ డాక్టర్‌ శిరీష పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ ప్రచార కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖర్‌ మాట్లాడుతూ ప్రజాసంక్షేమమే పరమా వధిగా, పేదల అభ్యున్నతే లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన ఘనత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిదే అన్నారు. అందులో భాగంగానే ప్రతి పేదవాడికీ ఉచితంగా మెరుగైన వైద్యం, పేద విద్యార్థులు సైతం ఉచిత వైద్యవిద్యను అభ్యసించాలన్న లక్ష్యంతో కేవలం రెండేళ్లల్లో 17 మెడికల్‌ కాలేజీలను జగనన్న నిర్మించారన్నారు. మెడికల్‌ కాలేజీలన్నీ పూర్తి అయితే వైద్యవిద్యను అభ్యసించాలన్న పేద విద్యార్థుల కల నెరవేరుతుందన్నారు. అనంతరం తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజాసంక్షేమాన్ని గాలికి వదిలేశారని ఆరోపించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో, ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో, సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. పేదలకు ఉచిత వైద్యం, ఉచిత వైద్య విద్యను అందించాలన్న ఉద్దేశంతో రాష్ట్రంలో 17 మెడికల్‌ కాలేజీలను జగనన్న తీసుకొస్తే, వాటిని ప్రైవేటుపరం చేయాలని చంద్రబాబు కుట్రలు పన్నడం దుర్మార్గమన్నారు. అనంతరం వైఎస్సార్‌ సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి మాట్లాడుతూ బ్రిటీష్‌ కాలం నుంచి 2019 వరకు రాష్ట్రంలో కేవలం 12 మెడికల్‌ కాలేజీలు మాత్రమే ఉండేవని గుర్తు చేశారు. ఐదేళ్ల జగనన్న పాలనలో కరోనా వంటి విఫత్కర పరిస్థితులు ఎదురైనప్పటికీ కేవలం రెండేళ్లల్లో 17 మెడికల్‌ కాలేజీలను తీసుకొచ్చి, అందులో ఏడు కాలేజీలను పూర్తి చేసి అడ్మిషన్ల దశకు తీసుకొచ్చారన్నారు. మిగిలిన పది కాలేజీలు 70 శాతం పూర్తి అయ్యాయని, వాటికి రూ.5 వేల కోట్లు ఖర్చుపెడితే పూర్తి అవుతాయని, తద్వారా పేదలందరికీ మెరుగైన వైద్యంతో పాటు పేద విద్యార్థులు ఉచితంగా వైద్యవిద్యను అభ్యసించగలరన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలో సుమారు రూ. 2లక్షల కోట్లను అప్పు చేసిందని, అందులో రూ. 5వేల కోట్లు మెడికల్‌ కాలేజీల నిర్మాణానికి వెచ్చించలేదా? అని ప్రశ్నించారు. మెడికల్‌ కాలేజీలను ప్రైవేటు పరం చేసి తద్వారా రూ. వేల కోట్లును దండుకోవాలని చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణతో ప్రజాఉద్యమం ప్రారంభమైందన్నారు. కూటమి ప్రభుత్వ మెడలు వంచైనా ప్రైవేటీకరణను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, టౌన్‌బ్యాంక్‌ చైర్మన్‌ కేతం జయచంద్రారెడ్డి, కార్పొరేటర్‌ రామస్వామి వెంకటేశ్వర్లు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బీరేంద్ర వర్మ, ప్రచార కమిటీ నాయకులు కాపు ఉమ, రమణారెడ్డి, అమరనాఽథ్‌రెడ్డి, కిషోర్‌కుమార్‌రెడ్డి, మురళీధర్‌, సుధీర్‌ తదితరులు పాల్గొన్నారు.

మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలు

కూటమికి బుద్ధి వచ్చేలా ప్రజాఉద్యమం1
1/4

కూటమికి బుద్ధి వచ్చేలా ప్రజాఉద్యమం

కూటమికి బుద్ధి వచ్చేలా ప్రజాఉద్యమం2
2/4

కూటమికి బుద్ధి వచ్చేలా ప్రజాఉద్యమం

కూటమికి బుద్ధి వచ్చేలా ప్రజాఉద్యమం3
3/4

కూటమికి బుద్ధి వచ్చేలా ప్రజాఉద్యమం

కూటమికి బుద్ధి వచ్చేలా ప్రజాఉద్యమం4
4/4

కూటమికి బుద్ధి వచ్చేలా ప్రజాఉద్యమం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement