తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సినీకార్మిక సంఘాలు యూసుఫ్‌గూడ పోలీసు గ్రౌండ్స్‌లో మంగళవారం(అక్టోబర్ 28, 2025) సన్మాన కార్యక్రమం నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి ఆర్ నారాయణమూర్తి, దిల్‌రాజు, విజయేంద్ర ప్రసాద్, పలువురు సినీ సంఘ పెద్దలు హాజరై సందడి చేశారు.
ఈ సందర్బంగా ఆయన సినీ నటులు, దర్శక నిర్మాతలను ఆప్యాయంగా పలకరించారు.
పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తిని ఆలింగనం చేసుకుని ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ కార్యక్రమానికి సినీ కార్మికులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు.


