తీర ప్రాంతం.. అప్రమత్తం
కోట : మండలంలోని తీరప్రాంత గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. గోవిందపల్లి, గోవిందపల్లిపాళెం, కొత్తపట్నం, శ్రీనివాససత్రంలో అధికారులు పర్యటించారు. మత్య్సకారులకు తగు జాగ్రత్తలు చెప్పారు. ముంపు ముప్పు ఉన్న పుచ్చలపల్లి, దైవాలదిబ్బ, దొరువుకట్ట, అల్లంపాడును క్షేత్రస్థాయిలో పరిశీలించి స్వర్ణముఖిలో వరద ప్రవాహం పరిశీలించారు. ఈ మేరకు కోటలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. గూడలి వద్ద స్వర్ణముఖినది బ్రిడ్జిపై వరదనీరు ప్రవహించే అవకాశాలు ఉండడంతో అక్కడ పోలీసు కాపలా పెట్టారు. దీంతో విద్యానగర్ నుంచి కొత్తపాళెం వరకు రోడ్డుపై రాకపోకలు స్తంభించాయి.


