వాహనం ఢీ కొని రెండు గేదెలు మృతి
బుచ్చినాయుడుకండ్రిగ: మండలంలోని పల్లమాల గ్రామం వద్ద కేటీ రోడ్డుపై గుర్తు తెలియని వాహనం ఢీ కొని రెండు గేదెలు మృతి చెందాయి. వీటి విలువ సుమారు రూ.లక్ష ఉంటుందని, పాలు ఇచ్చే గేదెలు మృతి చెందడంతో పాడి రైతు గోపాల్‌రెడ్డి లబోదిబోమన్నారు.
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
నాయుడుపేట టౌన్ : మోంథా తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తిరుపతి జిల్లా ప్రత్యేక అధికారి అరుణ్‌బాబు ఆదేశించారు. ఆయన సోమవారం సూళ్లూరుపేట ఆర్డీవో కిరణ్మయితో కలిసి నాయుడుపేట రెవెన్యూ కార్యాలయలంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను పరిశీలించారు. అనంతరం తహసీల్వార్ రాజేంద్ర, ఎంపీడీఓ సురేష్ బాబు, సీఐ బాబి, మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజులుల్లా తదితరులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ స్వర్ణముఖి నది, మామిడి కాలువ నీటి ప్రవాహంతోపాటు చెరువుల పరిస్థితిపై ఆరా తీశారు. లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. తుపాను తీవ్రమైతే వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు.
వాహనం ఢీ కొని రెండు గేదెలు మృతి


