హౌసింగ్ ఏఈపై కేసు నమోదు
బాలాయపల్లి(సైదాపురం): ఆర్టీసీ బస్సులో విధులు నిర్వహిస్తున్న మహిళ కండెక్టర్‌పై దురుసుగా వ్యవహరించారన్న ఆరోపణతో వెంకటగిరి హౌసింగ్ ఏఈ శ్రీనివాసులపై కేసు నమోదు చేసినట్లు బాలాయపల్లి ఎస్‌ఐ గోపి తెలిపారు. వెంకటగిరి– గూడూరు మార్గంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్న హౌసింగ్ ఏఈ శ్రీనివాసులు బస్సులోని మహిళా కండెక్టర్ కస్తూరమ్మతో దురుసుగా ప్రవర్తించడం, విధులకు అడ్డుపడడంతోపాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని బెధిరింపులకు పాల్పడ్డారన్నారు. ఈ మేరకు కండెక్టర్ బాలాయపల్లి పోలీసులు స్టేషన్ వద్ద బస్సు ఆపి, శ్రీనివాసులను పోలీసులకు అప్పగించి, ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గోపి తెలిపారు.


