సియోల్‌లో శ్రీసిటీ బృందం | - | Sakshi
Sakshi News home page

సియోల్‌లో శ్రీసిటీ బృందం

Oct 28 2025 8:18 AM | Updated on Oct 28 2025 8:18 AM

సియోల్‌లో శ్రీసిటీ బృందం

సియోల్‌లో శ్రీసిటీ బృందం

● సియోల్‌లో జరిగిన కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌, ఐటీ ప్రదర్శన (కేఈఎస్‌ 2025) ను సందర్శించారు. కోట్రా (కొరియా ట్రేడ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ ఏజెన్సీ) అధికారులు, ఇతర వ్యాపార సమూహాలతో వ్యూహాత్మక సమావేశాలు నిర్వహించి, పెట్టుబడి భాగస్వామ్య అవకాశాలను చర్చించారు. ● శ్రీసిటీ వేగవంతమైన పురోగతిని ప్రశంసించిన నిషికాంత్‌ సింగ్‌, భవిష్యత్‌ కొరియా పెట్టుబడులకు తన మద్దతు తెలిపారు. ఈ పర్యటన శ్రీసిటీ, కొరియన్‌ పరిశ్రమల భాగస్వామ్యాన్ని బలపరుస్తుందని శ్రీసిటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రవీంద్ర సన్నారెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.

శ్రీసిటీ (వరదయ్యపాళెం): విదేశీ పెట్టుబడులు, వ్యాపార విస్తరణలో భాగంగా శ్రీసిటీ మార్కెటింగ్‌ బృందం సోమవారం కొరియాలో పర్యటించింది. ఈ సందర్భంగా సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఆర్‌.శివశంకర్‌ నేతృత్వంలో సియోల్‌లోని భారత రాయబార కార్యాలయం డిప్యూటీ మిషన్‌ చీఫ్‌ నిషికాంత్‌ సింగ్‌, జపాన్‌ ఉన్నతాధికారులను కలిసి, ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక ప్రగతి, 31 దేశాలకు చెందిన 240కు పైగా పరిశ్రమలను ఆకర్షించడంలో శ్రీసిటీ కీలక పాత్రను తెలియజేశారు. ఎల్జీ, సోలుమ్‌, హ్యుందాయ్‌ ఇంజినీరింగ్‌ ప్లాస్టిక్స్‌ (హెచ్‌డీసీ), ఎస్కే ప్యుకోర్‌, ఎల్జీ పాలిమర్స్‌ వంటి ప్రముఖ కొరియన్‌ కంపెనీలు ఇప్పటికే శ్రీసిటీలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు వారికి వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement