వెంకటగిరిని వీడే ప్రసక్తే లేదు
వెంకటగిరి(సైదాపురం): వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డిపై ఇటీవల ఓ ఛానల్‌లో వచ్చిన వ్యాఖ్యలపై నేదురుమల్లి ఘాటుగా స్పందించారు. పట్టణంలోని 8వ వార్డులో సోమవారం జరిగిన కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమంలో నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ తనకు ప్రమోషన్ వచ్చిందని, ఢిల్లీకి పోతానని, ఓ ఛానల్‌లో దుష్ప్రచారం చేయడం సమంజం కాదన్నారు. వెంకటగిరి ప్రజానికాన్ని వదిలి ఢిల్లీకి కాదు కదా ఎక్కడికి వెళ్లనని స్పష్టం చేశారు. వెంకటగిరి నియోజకవర్గంలోనే ఉంటూ ప్రజలకు ఎళ్లవేలా సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తనపై సుముఖంగా ఉన్నారని, రానున్న ఎన్నికల్లో వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా తానే బరిలో నిలవనున్నట్లు తెలిపారు. ఫేక్ న్యూస్‌లు సృష్టించి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే సహించేది లేదన్నారు. వెంకటగిరి నియోజకవర్గం తమ కుటుంబానికి ఎన్నో ఏళ్లుగా అనుబంధం ఉందని, ఆ బంధం అలానే నేదురుమల్లి వారసుడిగా కొనసాగిస్తానని చెప్పారు.


