
టిప్పర్ ఢీకొని కార్మికుడు మృతి
సూళ్లూరుపేట: మండలంలోని బైపాస్‌రోడ్డు ఎన్‌హెచ్–16 డంపింగ్‌యార్డు వద్ద శనివారం రాత్రి టిప్పర్ ఢీకొని అపాచి కార్మికుడు మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు వరదయ్యపాళెం రాచర్ల గ్రామానికి చెందిన కంరారపు ప్రసన్నకుమార్ (36) పాచిలో పని చేస్తూ తడ మండలం కాదలూరులో నివాసం ఉంటున్నారు. శనివారం రాత్రి సూళ్లూరుపేటకు వచ్చి పనులన్నింటినీ చూసుకుని తిరిగి కాదలూరుకు మోటార్‌సైకిల్‌పై వెళుతుండగా హఠాత్తుగా టిప్పర్ దూసుకొచ్చి ఢీ కొంది. అతన్ని 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకెళ్లగా మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలున్నారు. పోలీసులు వారికి సమాచారం అందించి కేసు నమోదు చేశారు. ఆదివారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
శ్రీగంధం చెట్లు నరికివేత: వ్యక్తి అరెస్టు
తిరుమల : శేషాచలం అటవీ ప్రాంతంలో శ్రీగంధం చెట్లు నరికివేసిన వ్యక్తిని ఆటవీశాఖ బేస్ క్యాంప్ సిబ్బంది దాడిచేసి పట్టుకున్న సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. తిరుమల–పాపవినాశనం రోడ్డులోని జపాలీ తీర్థానికి సమీపంలో ఓ వ్యక్తి శ్రీగంధం చెట్టును నరికివేసి అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించాడు. ఇంతలో అటవీశాఖ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి మూడు శ్రీగంధం చెట్టు వేరు భాగాలు రంపాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని తిరుపతికి తరలించి అటవీశాఖ అధికారులు విచారిస్తున్నారు.
అక్రమ వెంచర్‌కు నోటీసు
తొట్టంబేడు: తొట్టంబేడు రెవెన్యూ పరిధిలోని బీడీ కాలనీ వద్ద సర్వే నంబర్ 269/4లో వేసిన అక్రమ వెంచర్‌ను వెంటనే తొలగించాలని పంచాయతీ సెక్రటరీ భార్గవ్ ఆదివారం నోటీసు జారీ చేశారు. సుమారు 1.5 ఎకరాల విస్తీర్ణంలో సుచిత్ర గార్డెన్‌న్ పేరుతో వేసిన లేఅవుట్‌కు అనుమతులు లేవని నోటీసులో పేర్కొన్నారు. ఇప్పుడు ఆ వెంచర్‌లో ప్లాట్లు కొనుగోలు చేసిన వారి పరిస్థితి సందిగ్ధంలో పడింది.

టిప్పర్ ఢీకొని కార్మికుడు మృతి

టిప్పర్ ఢీకొని కార్మికుడు మృతి

టిప్పర్ ఢీకొని కార్మికుడు మృతి