
తుడా వీసీకిఘనంగా వీడ్కోలు
తిరుపతి తుడా:తుడా వీసీ శుభం బన్సల్‌కు ఘనంగా వీడ్కోలు పలికారు. మంగళవారం ఈ మేరకు తుడా కార్యాలయంలో కార్యదర్శి శ్రీకాంత్, ఇతర అధికారులు పుష్పగుచ్ఛం అందించి జ్ఞాపికతో సత్కరించారు. తుడా అభివృద్ధికి శుభం బన్సల్ ఎనలేని సేవలందించారని కొనియాడారు. అధికారులు సుజన, దేవకికుమారి, శైలజ పాల్గొన్నారు.
గజదాడులపై ఆందోళన
భాకరాపేట : చిన్నగొట్టిగల్లు మండలం చిట్టేచర్ల పంచాయతీ తుమ్మచేనుపల్లెలో ఏనుగుల దాడు లు పెరిగిపోతున్నాయని వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు సింహాల మోహన్ ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ పంట పొలాలు, కొబ్బరి చెట్లను ఏనుగుల నాశనం చేస్తున్నాయన్నారు. దీనిపై గ్రామస్తులు పలుమార్లు ఫిర్యాదు చేసినా అటవీశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు.