
మంచి విధానం కాదు
ఎక్కడో నిర్వహించే సభలకు ఇక్కడి నుంచి బస్సులను పంపించడం మంచి విధానం కాదు. జన సమీకరణ పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదు. అంతగా అవసరమైతే ప్రైవేట్ బస్సులను అద్దెకు తీసుకోవాలి. అంతే కానీ ఆర్‌టీసీ సర్వీసులను తీసుకెళితే ప్రయాణికులు ఎంతగా అవస్థలు పడతారో పాలకులు గుర్తించాలి. ఇందులో కూటమి ప్రభుత్వ వైఖరి దారుణంగా ఉంది. – వేణుగోపాల్, తిరుపతి
వ్యతిరేకత తప్పదు
ప్రతి దానికీ అనవసరంగా ఆర్‌టీసీ బస్సులను వాడేస్తూ ప్రజలను ఇబ్బంది పెడితే ప్రభుత్వంపై వ్యతిరేకత తప్పకుండా పెరుగుతుంది. ప్రయాణికులను ఈ విధంగా అవస్థలకు గురిచేయడం దారుణం. బస్టాండుల్లో గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తుంది. అప్పుడప్పుడు వచ్చే అరకొర బస్సుల్లో ఎక్కేందుకు యుద్ధమే చేయాల్సి వస్తుంది. జిల్లాలో ఆర్‌టీసీ తీరు కూడా అధ్వాన్నంగా ఉంది. – జనార్ధన్‌రెడ్డి, రేణిగుంట

మంచి విధానం కాదు