
పౌష్టికాహారంతో ఆరోగ్యం
తిరుపతి అర్బన్ : పిల్లలు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారంతో ఆరోగ్యం పొందవచ్చని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో జాతీయ పోషకాహార మాసోత్సవాలు ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన ప్రజలతోనే దేశం అభివృద్ధి వైపు పయనిస్తుందన్నారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో తల్లీబిడ్డలకు పోషకాహారం అందించాలని ఆదేశించారు. ఈ మేరకు పీఎం పోషణ్ అభియాన్‌ను పటిష్టంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. బాలామృతం. బాలామృతం ప్లస్ కార్యక్రమాలను కచ్చితంగా చేపట్టాలని కోరారు. అనంతరం ఐసీడీఎస్ వారు ఏర్పాటు చేసిన పోషకాహార స్టాల్స్‌ను పరిశీలించారు. బెస్ట్‌బేబీస్‌గా ఎంపికై న పిల్లల తల్లులు, ప్రభుత్వ బాలికల వసతి గృహంలోని పిల్లలకు నిర్వహించిన ఆటల పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. డీఈఓ కేవీఎన్ కుమార్, డీఐఓ డాక్టర్ శాంతాకుమారి, టాటా ట్రస్ట్ మేనేజర్ సుబ్రమణ్యం, విజయవాహిని ట్రస్ట్ వీరబాబు, స్కిల్ డెవల్‌మెంట్ అధికారి లోకనాథం పాల్గొన్నారు.