
ఐజర్‌కు ఎస్‌బీఐ భారీ విరాళం
తిరుపతి ఎడ్యుకేషన్: తిరుపతిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐజర్)కు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) రూ.23.60లక్షల విరాళం అందించింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) కింద ఐజర్‌లో మౌలిక వసతుల కల్పన ఈ మొత్తం అందజేసింది. ఇందులో అత్యవసర వైద్య సేవల నిమిత్తం రూ.15.38లక్షల విలువైన అంబులెన్స్, క్యాంటీన్ సేవల మెరుగుపరిచేందుకు రూ.8.22లక్షల విలువైన ఆటోమెటిక్ కియోస్క్ వ్యవస్థను వితరణ చేసింది. మంగళవారం ఈ మేరకు ఎస్‌బీఐ ఉన్నతాధికారులు రాజేష్‌కుమార్ పటేల్, అమరేంద్రకుమార్ సుమన్, దినేష్ గులాటీ చేతుల మీదుగా ఐజర్ ప్రతినిధులకు అందజేశారు.
‘సంతకాల’తో
ప్రజా ఉద్యమం
నాగలాపురం : మెడికల్ కళాశాల ప్రైవేటీకరణపై కోటి సంతకాలతో ప్రజా ఉద్యమం చేపట్టామని వైఎస్సార్‌సీపీ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ స్పష్టం చేశారు. మంగళవారం నాగలాపురంలో కోతి సంతకాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. రాజేష్ మాట్లాడుతూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన 17 వైధ్య కాలేజీలను ప్రైవేటుపరం చేయాలన్న కూటమి సర్కారు నిర్ణయం సరికాదన్నారు. గత ప్రభుత్వం 6 కళాశాల నిర్మాణం పూర్తి చేసిందని, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు. దీనిపై ప్రతి గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించి, సంతకాల సేకరిస్తున్నామని వెల్లడించారు. పేద విధ్యార్థుల జీవితాలతో సీఎం చంద్రబాబు ఆటలాడుతున్నారని మండి పడ్డారు. దుర్మార్గపు ఆలోచనలను పక్కన పెట్టి ప్రజా సంక్షేమానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి బీరేంద్ర వర్మ, నేతలు అపరంజిరాజు, చిన్నదొరై, శ్యామ్, జగదీష్ రెడ్డి, మహేష్ రెడ్డి, భాను ప్రకాష్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, మోహన్ మొదలియార్, కులశేఖర్ రెడ్డి, వజ్రవేలు, షాబుద్దీన్,ఈశ్వర్, దానివేలు, ఏలుమలై, బాబు, చిరంజీవి, ఉదయ్ కుమార్, హరిబాబు పాల్గొన్నారు.
నేటి నుంచి టీటీడీ విశ్రాంత ఉద్యోగులకు శ్రీవారి ప్రసాదం
తిరుపతి అన్నమయ్యసర్కిల్: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల అనంతరం ఆనవాయితీగా టీటీడీ విశ్రాంత ఉద్యోగులకు శ్రీవారి ప్రసాదాలను బుధవారం నుంచి పంపిణీ చేయనున్నారు. మంగళవారం ఈ మేరకు టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది. తిరుపతిలోని టీటీడీ క్యాంటీన్ వద్ద జాబిలి భవనంలో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు టీటీడీ స్మార్ట్ ఐడీ కార్డు చూపించి ఒక పెద్ద లడ్డూ, ఒక వడ తీసుకోవాలని సూచించింది. పీపీఓ నంబర్ల వారీగా ప్రసాదాల పంపిణీ జరుగుతుందని వెల్లడించింది. 15, 16 తేదీలలో 164 నుంచి 5,500 పీపీఓ నంబర్ వరకు, 17న 5,501 నుంచి 7,000, 18న 7,001 నుంచి 8,500, 22న 8,501 నుంచి 10,000 వరకు, 23న 10,001 నుంచి 12,500 వరకు, 24వ తేదీన 12,501 నుంచి మిగిలిన వారికి ప్రసాదాలు అందించనున్నట్లు పేర్కొంది.
బుద్ధుని విగ్రహావిష్కరణ
డక్కిలి : మండలంలోని వెంబులూరు పంచాయతీ అంబేడ్కర్ నగర్‌లో మంగళవారం గౌతమ బుద్ధుని విగ్రహం ఆవిష్కరించారు. అంబేడ్కర్ ధర్మ పోరాట సమితి అధ్యక్షుడు గండోలు గోపాల్ ఆధ్వర్యంలో బంతేజి దమ్మానంద ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సమితి వ్యవస్థాపకుడు ఇంగిలాల రామచంద్రరావు, నేతలు ఎరబోతు సుబ్రమణ్యం, నిజమాల ప్రసాద్, చిట్టేటి రమణయ్య, జంగిటి వెంకటయ్య, నావూరు శంకర్ పాల్గొన్నారు.

ఐజర్‌కు ఎస్‌బీఐ భారీ విరాళం

ఐజర్‌కు ఎస్‌బీఐ భారీ విరాళం