
ప్రతిష్టాత్మకంగా అమృత్ భారత్ స్టేషన్
సూళ్లూరుపేట : అంతరిక్ష ప్రయోగాలకు అతి చేరువగా, శ్రీసిటీ, మాంబట్టు పారిశ్రామికవాడలకు అత్యంత దగ్గరగా, నేలపట్టు పక్షుల పర్యాటక కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న సూళ్లూరుపేట రైల్వేస్టేషన్‌ను ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసారి చంద్రశేఖర్, ఎమ్మెల్యే నెలవల విజయశ్రీతో కలిసి అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా రూ.14.50 కోట్లతో ఆధునీకరించిన సూళ్లూరుపేట రైల్వేస్టేషన్‌ను ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి దూరదృష్టితో అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా 1300 పైగా రైల్వేస్టేషన్లను ఆధునీకరించారని, అందులో భాగంగా గురువారం 130 రైల్వేస్టేషన్లను ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, చైన్నె డివిజనల్ రైల్వే మేనేజర్ విశ్వనాథ ఈర్య, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాకాటి నారాయణరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు నరసింహయాదవ్, ఆర్డీఓ కిరణ్మయి, మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రమణ్యం, రైల్వే అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.
వర్చువల్ విధానంలో సూళ్లూరుపేట రైల్వేస్టేషన్‌ను ప్రారంభించిన ప్రధాని
మోదీ ముందుచూపుతోనే స్టేషన్ల అభివృద్ధి
కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని