
వ్యక్తి దారుణ హత్య
రాపూరు : రాపూరు పట్టణానికి చెందిన వ్యక్తి మండలంలోని తాతిపల్లి వద్ద దారుణ హత్యకు గురికావడం కలకలం రేపుతోంది. రాపూరుకు చెందిన షషీ (52) స్థానిక మూడు రోడ్ల కూడలిలో కూల్ డ్రింక్ షాపు నడుపుతున్నాడు. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో షాపు మూసి వేసి ఇంటికి బయలుదేరాడు. కానీ ఎంత సేపటికీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు రాత్రి గాలింపు చర్యలు చేపట్టారు. అయితే శనివారం ఉదయం రాపూరు మండలం తాతిపల్లి సమీపంలో ఒక వ్యక్తి హత్యకు గురైనట్లు స్థానికులు కండలేరు పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని హత్యకు గురైన వ్యక్తి షషీగా నిర్ధారించారు. ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్, సీఐ గంగాధర్ , సీఐ సత్యనారాయణ , కండలేరు ఎస్‌ఐ రామకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని డాగ్ స్క్వాడ్, క్లూస్‌టీంను రప్పించి పరిశీలించారు. షషీ ముఖం, మెడపైన కత్తిగాట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హత్యకు గల కారణాలపై వివిధ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. మృతుడికి భర్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిపారు.

వ్యక్తి దారుణ హత్య