
సైనికులకు సంఘీభావం
తిరుపతి, అన్నమయ్య సర్కిల్ : తిరుపతి రైల్వేస్టేషన్‌లో గురువారం రైల్వే రక్షణ దళం (ఆర్‌పీఎఫ్), ప్రభుత్వ రైల్వేపోలీసు (జీఆర్‌పీ), ఇతర అధికారులు, రైల్వే మిత్ర బృందంతో కలసి సైనికులకు సంఘీభావంగా జాతీయ జెండాతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. కార్యక్రమంలో సందీప్‌కుమార్, ఆర్పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ ఆశీర్వాదం, జీఆర్‌పీ ఎస్‌ఐలు రాంబాబు, రామకృష్ణ, రత్నమాల, స్టేషన్ మాస్టర్, కమర్షియల్ ఇన్‌స్పెక్టర్, ఇతర అధికార సిబ్బంది పాల్గొన్నారు.
బాలికపై హత్యాచార ఘటనలో నిందితుడు అరెస్టు
చంద్రగిరి : బాలికపై లైంగిక దాడికి పాల్పడి ఆపై బాలికను హతమార్చిన నిందితుడిని ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు గురువారం చంద్రగిరి డీఎస్పీ ప్రసాద్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన రాజే ష్‌నాయక్ తన భార్య, ఆరేళ్ల పాపతో కలసి మండల పరిధిలోని ఎం.కొంగరవారిపల్లి వద్ద ఉన్న ఓ ఇటుక బట్టీ వద్ద దినసరి కూలీగా పనిచేస్తుండగా, సమీప గ్రామానికి చెందిన నిందితుడు బాల కిషోర్ అక్కడే కూలీగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో గత ఏడాది జనవరి 3వ తేదిన బాలిక కనిపించకపోవడంతో రాజేష్ నాయక్ చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరుసటి రోజు బాలిక శవమై కనిపించడంతో పోస్టుమార్టం నిర్వహించారు. బాలికపై లైంగిక దాడి చేసి ఆపై హత్య చేసినట్లుగా రిపోర్టు రావడంతో పోలీసులు పోక్సో కేసుగా మార్చారు. ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న నిందితుడు బాల కిషోర్ పోలీసుల కళ్లు కప్పి పారిపోవడంతో అతడి కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో సీఐ సుబ్బరామిరెడ్డి ఆధ్వర్యంలో గురువారం నిందితుడిని తిరుపతిలో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణలో బాలికకు తినుబండారాల ఆశ చూపి, ఇటుక బట్టీ నుంచి కిడ్నాప్ చేసి అటవీ ప్రాంతంలో అత్యాచారానికి పాల్పడినట్లు నిందితుడు తెలిపారన్నారు. ఈ మేరకు నిందితుడి వాంగ్మూలం రికార్డు చేసి, రిమాండుకు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసును ఛేదించినందుకు చురుగ్గా వ్యవహరించిన సిబ్బందికి ఎస్పీ ఆదేశాల మేరకు నగదు ప్రోత్సాహ బహుమతిని అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ అనితతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

సైనికులకు సంఘీభావం