
అయ్యా.. మాబిడ్డను సౌదీ నుంచి రప్పించండి
– తహసీల్దార్‌కు ఓతండ్రి విన్నపం
కలువాయి(సైదాపురం):అయ్యా.. మా బిడ్డను సౌదీ నుంచి రప్పించి కాపాడాలని కలువాయి తహసీల్దార్ శ్యాంసుందర్‌కు మండలంలోని కుల్లూరు గ్రామానికి చెందిన షేక్ కాలేషా, బీబీ దంపతులు వేడుకున్నారు. వివరాలు ఇలా.. కలువాయి మండ లంలోని కుల్లూరు గ్రామానికి చెందిన షేక్ కాలేషా, బీబీలకు షేక్ నజీర్ అనే కుమారుడున్నారు. అతను 7వ తరగతి వరకు చదువుకున్నాడు. 2024 డిసెంబర్ నెలలో ఓ ఏజెంటు మాటలు విని రూ.2 లక్షలు పెట్టి కుమారుడు నజీర్‌ను సౌదీ అరేబియా దేశానికి పంపారు. అక్కడ యజమాని పెట్టే చిత్ర హింసలు భరించలేకపోవడంతో ఫోన్ ద్వారా తమకు జరుగుతున్న సంఘటనపై చెప్పుకునే వాడన్నారు. దీంతో తమ బిడ్డను ఎలాగైనా ఇండియాకు రప్పించి ఆదుకోవాలని కన్నీరుమున్నీరయ్యారు.

అయ్యా.. మాబిడ్డను సౌదీ నుంచి రప్పించండి