
ప్రాణం తీసిన ఈత సరదా
● ఒకరి మృతి.. ప్రాణాలతో బయటపడ్డ మరో ముగ్గురు
తెప్పపై విహరిస్తున్న స్వామి అమ్మవార్లు (ఇన్‌సెట్)
తెప్పపై విశేషాలంకరణలో స్వామి అమ్మవార్లు
శ్రీకాళహస్తి : ఈత సరదా ఓ యువకుడి నిండు ప్రాణాలను బలిగొనగా.. మరో ముగ్గురు యువకులు ప్రాణాలతో బయటపడిన సంఘటన మంగళవారం తొట్టంబేడు మండలంలోని ఇలగనూరు తెలుగు గంగ కాలువ వద్ద చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. తొట్టంబేడు మండలం దైనేడు గ్రామానికి చెందిన రాగిపాటి వేణుమాధవ్ తండ్రి మరణించడంతో తల్లితో కలిసి నాయుడుపేట సమీపంలోని విన్నమాలలో అమ్మమ్మ వద్దే పదేళ్లుగా నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో తాగుడుకు బానిసైన వేణు మాధవ్(18) మంగళవారం స్నేహితులతో కలిసి ఏర్పేడు మండలంలోని మూలకండ్రిగకు బయలుదేరాడు. మార్గ మధ్యలో ఇలగనూరు వద్ద తెలుగు గంగ కాలువలో ఈత సరదా తీర్చుకునేందుకు స్నేహితులతో కలిసి దిగారు. ఈ క్రమంలో వేణుమాధవ్ నీటి ఉధృతికి కొట్టుకొని పోగా అతడి స్నేహితులు సుమన్, చందు, సుబ్బు ఎలాగోలా ప్రాణాలతో ఒడ్డుకు చేరుకున్నారు. నీటి ఉధృతికి కొట్టుకుపోయి ప్రాణాలు విడిచిన వేణుమాధవ్ మృతదేహాన్ని కొంతమంది జాలర్లు సమీపంలోనే ఒడ్డుకు చేర్చారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే మృతుడి బంధువులు వేణు మృతిపై అనుమానాలున్నాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ప్రాణం తీసిన ఈత సరదా

ప్రాణం తీసిన ఈత సరదా