
పట్టుదలతో శ్రమిస్తేనే భవిత
తిరుపతి ఎడ్యుకేషన్ : పట్టుదలతో ప్రణాళికాబద్ధంగా శ్రమిస్తేనే బంగారు భవిత సాధ్యమని సివిల్స్ విజేత పామూరి సురేష్ తెలిపారు. ఆదివారం తిరుపతిలోని ఆఫీసర్స్ క్లబ్‌లో గీతా గోవిందం సేవా సమితి ఆధ్వర్యంలో పది పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను సత్కరించారు. ముఖ్యఅతిథిగా హాజరైన సురేష్ మాట్లాడుతూ ఆసక్తికి అనుగుణంగా లక్ష్యం నిర్దేశించుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు జ్ఞాపికలు బహూకరించారు. కార్యక్రమంలో గీతాగోవిందం సేవా సమితి అధ్యక్షుడు దామోదర్‌రావు, కార్యదర్శి వరదరాజులు పాల్గొన్నారు.