
అలరించిన ‘ఆత్రేయ గీతామృతం’
శ్రీసిటీ(సత్యవేడు): శ్రీసిటీ ఆధ్యాత్మిక సాహిత్య వేదిక శ్రీవాణి ఆధ్వర్యంలో స్థానిక బిజినెస్ సెంటర్‌లో శనివారం నిర్వహించిన ‘ఆత్రేయ గీతామృతం’ కార్యక్రమం అలరించింది. మద్రాసు విశ్వవిద్యాయలయం తెలుగు శాఖాధ్యక్షులు ఆచార్య విస్తాలి శంకరావు వక్తగా విచ్చేసి ఆత్రేయ గారి సినీ గీతాలు, అందులోని అర్థవంతమైన సాహిత్యం, మాధుర్యం, ప్రాముఖ్యత గురించి వివరించారు. ఈ సందర్భంగా శంకరరావు మాట్లాడుతూ సినీసాహిత్యంలో ఓ విశిష్ట మైలురాయి ఆత్రేయ గీతాలన్నారు. మూగమనస్సులు సినిమాలోని ‘నా పాట నీ నోట పలకాలి చిలుక’.. ‘ముద్దబంతి పువ్వులో మూగ కళ్ల ఊసులో’.. ‘నీముక్కుమీద కోపం ముఖానికే అదం’ తదితర గీతాలను ప్రస్తావించి విశ్లేషించారు. కార్యక్రమ ప్రారంభంలో చైన్నె వేదవిజ్ఞాన వేదిక సంస్థ కార్యదర్శి కందనూరి మధు సభికులకు ఆచార్య శంకరరావు గురించి పరిచయం చేశారు. శ్రీసిటీ పీఆర్వో పల్లేటి బాలాజీ సమన్వయకర్తగా వ్యవహరించారు. శ్రీసిటీ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు, సూళ్లూరుపేట, శ్రీహరికోట, శ్రీసిటీ ప్రాంతాల నుంచి పలువురు పాల్గొన్నారు.