ఆధునిక కాలానికి సంస్కృతం అవసరం
తిరుపతి సిటీ: ఆధునిక కాలానికి సంస్కృత భాష ఎంతో అవసరమని, భాష ఆవశ్యకతను భవిష్యత్తు తరాలకు పెద్ద ఎత్తున తెలియజేయాల్సిన అవసరం ఉందని అఖిల భారతీయ సంఘ కార్యవాహ్ సురేష్ సోని అభిప్రాయపడ్డారు. జాతీయ సంస్కృత వర్సిటీ, సంస్కృత భారతి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న స్ఫూర్తి సంఘమం కార్యక్రమం ఆదివారంతో ముగిసింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. సంస్కృతాన్ని ప్రతి ఒక్కరూ చదువుకుని, అందులోని జ్ఞానాన్ని పొందాలని సూచించారు. వీసీ జీఎస్‌ఆర్ కృష్ణమూర్తి మాట్లాడు తూ భవిష్యత్తులో సంస్కృత భాషను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. సంస్కృత భాషను విశ్వవ్యాప్తం చేసేందుకు వర్సిటీ తన వంతు కృషి చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంస్కృత భారతి అఖిల భారతీయ అధ్యక్షుడు ప్రొఫెసర్ గోపబంధు మిశ్రా, కేంద్రియ సంస్కృత వర్సిటీ వీసీ ప్రొఫెసర్ శ్రీవాస వార్కేడి, డాక్టర్ ఎంజీ నందన్‌రావు, డాక్టర్ ఎస్‌ఎల్ సీతారాం శర్మ తదితరులు పాల్గొన్నారు.


