
సిద్ధార్థను సందర్శించిన జపాన్ బృందం
నారాయణవనం: మండలంలోని సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాలను జపాన్‌కు చెందిన జేఎస్ ఒబెర్లిన్ యూనివర్సిటీ బృందం శుక్రవారం సందర్శించింది. విద్యార్థులు, అధ్యాపకుల పరస్పర ఎక్సేంజ్, ఉద్యోగ కల్పన విషయంలో ఎంఓయూ కుదుర్చుకున్నట్లు కళాశాల చైర్మన్ డాక్టర్ అశోకరాజు తెలిపారు. జేఎఫ్ ఒబెర్లిన్ యూనివర్సిటీ ప్రతినిధులు ఫుమిటీక్‌నకముర, టాకేరు తెరసావా, న్యూఢిల్లీకి చెందిన నీరూధావ్ కళాశాలలో మౌలిక సదుపాయాలు, ప్రయోగశాలలు, ఆడిటోరియం, సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కేంద్రాలను సందర్శించారు. అనంతరం జపాన్ యూనివర్సిటీ బృందంతో అశోకరాజుతో పాటు కళాశాలల ప్రిన్సిపాళ్లు చంద్రశేఖర్‌రెడ్డి, జనార్దనరాజు, వివిధ విభాగాల హెచ్‌వోడీలు సమావేశమయ్యారు. అశోకరాజు మీడియాతో మాట్లాడుతూ సిద్ధార్థ కళాశాల, ఒబెర్లిన్ యూనివర్సిటీలు టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్, పరిశోధన, ఇండస్ట్రీ టయప్‌తో పాటు ఆఫర్ చేస్తున్న కోర్సులను మ్యాపింగ్ చేస్తూ కొత్త కోర్సులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రెండు విద్యా సంస్థలు పరస్పరం అధ్యాపకులను, విద్యార్థులను ఎక్సేంజ్ చేసుకుంటూ ఇంజినీరింగ్ విద్యార్థులకు కొత్త కోర్సులతో మంచి భవిష్యత్‌ను అందించనున్నట్టు అశోకరాజు తెలిపారు.