YS Sharmila Political Party Announcement on April 9th 2021 - Sakshi
Sakshi News home page

ఏప్రిల్‌ 9న రాజకీయ పార్టీ ప్రకటన: వైఎస్‌ షర్మిల

Mar 17 2021 4:27 AM | Updated on Mar 17 2021 10:38 AM

YS Sharmila To Announce Party On April 9th - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తాను ఎవరూ వదిలిన బాణం కాదని దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి తనయురాలు వైఎస్‌ షర్మిల స్పష్టం చేశారు. మంగళవారం లోటస్‌పాండ్‌లోని తన కార్యాలయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ముఖ్య నేతలతో సమన్వయ సమావేశం జరిగింది. జిల్లా నేత లక్కినేని సుధీర్‌ ఆధ్వర్యంలో పలువురు ముఖ్య నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. పార్టీ ఏర్పాటు, విధి విధానాల విషయంలో పార్టీ నేతలకు ఉన్న అనుమానాలపై క్లారిటీ ఇచ్చా రు. టీఆర్‌ఎస్‌కో, బీజేపీకో ‘బీ’టీమ్‌గా ఉండాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. సమస్యల సాధనకు మాత్రమే తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేశానని చెప్పారు. ఖమ్మం వేదికగానే పార్టీ సమర శంఖం పూరిద్దామని పిలుపునిచ్చారు. ఏప్రిల్‌ 9న లక్ష మంది సమక్షంలో పార్టీ ఏర్పాటు ప్రకటన చేద్దామని చెప్పారు. ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేయాలని పలువురు వైఎస్‌ఆర్‌ అభిమానులు షర్మిలను కోరారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement