వివేకా కేసు: గంగిరెడ్డిని కలిసేందుకు సునీత ప్రయత్నం!

Viveka Case: Sunitha tries to meet A1 Gangireddy In Chanchalguda Jail - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో చంచల్‌గూడ జైల్లో ఉన్న ఏ1 ఎర్ర గంగిరెడ్డిని కలిసేందుకు వివేకా కూతురు సునీత ప్రయత్నించారు. నిన్న(శుక్రవారం) మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో చంచల్‌గూడ జైలుకు వెళ్లిన సునీత.. గంగిరెడ్డిని కలిసేందుకు యత్నించారు.

గంగిరెడ్డిని కలవాలంటూ జైలు అధికారులను ఆమె రిక్వెస్ట్‌ చేశారు. అయితే అనుమతించలేమని జైలు అధికారులు స్పష్టం చేయడంతో చివరకు సునీత లాయర్‌కు మాత్రమే అనుమతి ఇచ్చారు అధికారులు. ఈ క్రమంలోనే కొన్ని పేపర్లపై గంగిరెడ్డితో సునీత లాయర్‌ సంతకాలు తీసుకున్నట్లు సమాచారం.  

ఒకవైపు వివేకా హత్య కేసులో దస్తగిరి బెయిల్‌ను రద్దు చేయాలంటూ వివేకా పీఏ కృష్ణారెడ్డి వేసిన పిటిషన్‌లో సునీత జోక్యం చేసుకున్నారు. కృష్ణారెడ్డి పిటిషన్‌ను పరిగణలోకి తీసుకోవద్దంటూ సునీత కోర్టును కోరారు. కృష్ణార్డెడ్డి ఈ కేసులో బాధితుడి కాదని, అందుచేత అతని పిటిషన్‌ను పరిగణలోకి తీసుకోవద్దని సునీత వాదన. ఈ నేపథ్యంలో గంగిరెడ్డిని కలిసేందుకు సునీత ప్రయత్నించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top