ఐసెట్‌లో 71,647 మంది పాస్‌ | TS ICET: Syed Muneebullah Hussaini tops exam | Sakshi
Sakshi News home page

ఐసెట్‌లో 71,647 మంది పాస్‌

Published Sat, Jun 15 2024 5:52 AM | Last Updated on Sat, Jun 15 2024 5:52 AM

TS ICET: Syed Muneebullah Hussaini tops exam

 అమ్మాయిలదే పైచేయి 

ఫలితాలు విడుదల చేసిన వాకాటి కరుణ

టాప్‌ ర్యాంకర్లు వీరే..

సాక్షి, హైదరాబాద్‌ : మాస్టర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్, మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మిని్రస్టేషన్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 5, 6 తేదీల్లో నిర్వహించిన ఉమ్మడి ప్రవేశపరీక్ష (టీజీఐసెట్‌) ఫలితాలను కాకతీయ విశ్వవిద్యాలయ వీసీ వాకాటి కరుణ శుక్రవారం విడుదల చేశారు. ఈ సెట్‌లో 91.92 శాతంమంది అర్హత సాధించారు. ఇందులోనూ మహిళలే పైచేయి సాధించారు. పురుషులు 33,928 మంది పాసయితే, మహిళలు 37,718 మంది ఉత్తీర్ణులయ్యాయి.

ఒక ట్రాన్స్‌జెండర్‌ కూడా అర్హత సాధించింది. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో జరిగిన ఫలితాల విడుదల కార్యక్రమంలో మండలిచైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి, వైస్‌చైర్మన్లు వి.వెంకటరమణ, ఎస్‌కే.మహ్మమూద్,సెట్‌ కనీ్వనర్‌ ఎస్‌.నర్సింహాచారి పాల్గొన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ఐసెట్‌కు 11 వేల మంది అదనంగా హాజరైనట్టు లింబాద్రి తెలిపారు. రాష్ట్రంలో 272 ఎంబీఏ కాలేజీల్లో 35,949 సీట్లు, 64 ఎంసీఏ కాలేజీల్లో 6990 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement