అధికారులను అప్రమత్తం చేసిన ట్రాన్స్‌కో సీఎండీ

Transco CMD Prabhakar Rao Alert Officials Over Reduced Electricity Demand - Sakshi

సెల్లార్‌లోకి నీరు వస్తే పవర్‌ సప్లై ఆఫ్‌ చేసుకోండి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో విద్యుత్‌ డిమాండ్‌ భారీగా పడిపోయింది. ఈ నేపథ్యంలో ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌ రావు విద్యుత్‌ అధికారులు, ఇంజనీర్స్‌ని అప్రమత్తం చేశారు. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలతొ విద్యుత్‌ డిమాండ్‌ 12 వేల వాట్స్‌ నుంచి 4300 వాట్స్‌కి పడిపోయింది. దాంతో ఓల్జేట్‌ పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. విద్యుత్‌ డిమాండ్‌లో హెచ్చుతగ్గుల నేపథ్యంలో రాత్రి నుంచి ఎప్పటికప్పుడు మానిటరింగ్‌ చేస్తూ.. లోడ్‌ డిస్పాచ్‌ చేయిస్తున్నారు. ఇక 1500 మెగావాట్స్‌ హైడల్‌ విద్యుత్‌ ఉత్పత్తి యధావిధిగా కొనసాగుతుంది.

ఈ సందర్భంగా సీఎండీ ప్రభాకర రావు మాట్లాడుతూ.. ‘విద్యుత్ డిమాండ్ తగ్గడంతో థర్మల్ యూనిట్స్ అన్ని బ్యాక్ డౌన్ చేశాము. వర్షం నీరు నిల్వ ఉన్న చోట విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్లు, తీగల పట్ల  ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడైనా రోడ్లపై, భవనాలపై తీగలు తెగిపడి ఉంటే వెంటనే సంస్థకు తెలియజేయగలరు. ఎక్కడైనా విద్యుత్ తీగలు తెగిపడినా, నీరు వచ్చిన దయచేసి ప్రజలు 1912 / 100  స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్‌తో పాటు స్థానిక విద్యుత్ శాఖ అధికారులకు ఫోన్ చేసి తెలపండి. ఎక్కడైనా వర్షం నీరు సెల్లార్‌లోకి వస్తే పవర్ సప్లై ఆఫ్ చేసుకోండి. అలా అయితే షాట్ సర్క్యూట్ కాకుండా ఉంటుంది’ అని తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top