
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎప్‌సెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్-ఫార్మసీ విభాగం ఫలితాలు విడుదలయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని తన నివాసంలో ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలు నేరుగా విద్యార్థుల మొబైల్‌కే వచ్చే విధంగా అధికారులు ఏర్పాటు చేశారు.
ఇంజనీరింగ్‌లో ఏపీకి చెందిన భరత్‌చంద్ర ఫస్ట్ ర్యాంక్, రామ్‌చరణ్‌రెడ్డి(రంగారెడ్డికి) సెకండ్ ర్యాంక్ సాధించారు. అగ్రికల్చర్ విభాగంలో మేడ్చల్‌కు చెందిన సాకేత్ ఫస్ట్ ర్యాంక్, లలిత్ వరేణ్య(కరీంనగర్) రెండో ర్యాంక్ సాధించారు. ఏప్రిల్ 29, 30 తేదీల్లో జరిగిన ఎప్‌సెట్ అగ్రికల్చర్ విభాగంలో 81,198 మంది.. మే 2, 3, 4 తేదీల్లో నిర్వహించిన ఇంజినీరింగ్ విభాగంలో 2,07,190 మంది హాజరయ్యారు.
విద్యార్థులు తమ ఎప్‌సెట్ ఫలితాలను కింద ఇచ్చిన సాక్షి అధికారిక ఎడ్యుకేషన్ వెబ్ సైట్‌లో పొందవచ్చు. 👇
👉TG EAPCET 2025 Results Direct Links
👉TG EAPCET Engineering Results
https://education.sakshi.com/sites/default/files/exam-result/TG-EAPCET-Engineering-Results-2025.html
👉TG EAPCET Agriculture and Pharmacy Results
https://education.sakshi.com/sites/default/files/exam-result/TG-EAPCET-Agriculture-pharmacy-Results-2025.html