ఒక్కరోజే 4,559 కేసులు  | Telangana Reports 4, 559 New Covid 19 Cases | Sakshi
Sakshi News home page

Telangana: ఒక్కరోజే 4,559 కేసులు 

Jan 26 2022 5:01 AM | Updated on Jan 26 2022 5:01 AM

Telangana Reports 4, 559 New Covid 19 Cases - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ కరోనా వైరస్‌ వేగంగా విజృంభిస్తోంది. మంగళవారం రాష్ట్రంలో 1.13 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 4,559 మంది వైరస్‌ బారినపడ్డారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తంగా కేసుల సంఖ్య 7.43 లక్షలకు చేరుకున్నాయి. తాజాగా 1,961 మంది కోలుకోగా, మొత్తంగా 7.03 లక్షల మంది రికవరీ అయ్యారు.

ఒక్కరోజులో కరోనాతో ఇద్దరు చనిపోగా, ఇప్పటివరకు వైరస్‌తో 4,077 మంది మృతిచెందారు. ప్రస్తుతం 36,269 క్రియాశీలక కరోనా కేసులున్నాయి. వాటిల్లో 3,335 మంది ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement