కరోనా కేసులు పెరుగుతున్నాయ్‌.. టెస్టులు పెంచండి: తెలంగాణ హైకోర్టు

Telangana High Court Asks State Government To Increase Covid Tests - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతుండడంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. అంతేకాదు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. టెస్టులు కూడా పెంచాలంటూ ఆదేశించింది.

కరోనా కేసులపై తాజాగా హైకోర్టులో విచారణ జరిగింది.  ఈ సందర్భంగా..  కేసులు పెరుగుతుండటంతో పరీక్షలు పెంచాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై స్పష్టమైన నివేదిక ఇవ్వాలని పేర్కొంది. అనంతరం విచారణను ఈ నెల 22కి హైకోర్టు వాయిదా వేసింది. గత వారం రోజులతో పోల్చితే హైదరాబాద్‌లో కేసులు గణనీయంగా పెరిగాయి.

రాష్ట్రంలో మంగళవారం 13,149 నమూనాలను పరీక్షించగా 119 పాజిటివ్‌లు నిర్ధరణ అయ్యాయి. సోమవారం ఈ సంఖ్య 65 మాత్రమే. క్రియాశీల కేసుల సంఖ్య పెరుగుతుండడంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలోనూ కరోనా కేసులు పెరుగు ముఖం పడుతుండడం గమనార్హం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top