సింగరేణిని అమ్మేందుకు కేంద్రం కుట్ర 

Telangana: Harish Rao Slammed The Center For Conspiring To Sell Singareni - Sakshi

మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం 

సాక్షి, మంచిర్యాల/సాక్షి, ఆసిఫాబాద్‌: దేశానికి వెలుగులు పంచుతున్న సింగరేణిని అమ్మేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మండిపడ్డారు. రాష్ట్రంలో 135 శాతం లాభాలతో ఉన్న సింగరేణికి చెందిన 4 బొగ్గు గనులు ప్రైవేటుకు అమ్మాలని ప్రధాని మోదీ చూస్తున్నారని తెలిపారు.

బీఎస్‌ఎన్‌ఎల్, రైళ్లు, విమానాలు, బ్యాం కులు.. ఇలా అన్నీ కేంద్రం అమ్మే స్తోందని ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డితో కలసి కుమురంభీం, మంచిర్యాల జిల్లాల్లో పర్యటించారు. ఆయా జిల్లాల  అధికారులతో సమీక్ష నిర్వహించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసి సభల్లో మాట్లాడారు. పావలా వడ్డీ ఈ నెలాఖరులో జమ చేస్తామని చెప్పారు.  

వైద్యానికి పెద్దపీట  
రాష్ట్రంలో గడిచిన 60 ఏళ్లలో మూడు వైద్య కళాశాలలు మాత్రమే మంజూరు కాగా.. సీఎం కేసీఆర్‌ అధికారంలోకి వచ్చాక ఏడేళ్లలో 17 వైద్య కళాశాలలు ఏర్పాటు చేసి వైద్యానికి పెద్దపీట వేశారని మంత్రి హరీశ్‌ చెప్పారు. ఒకనాడు మారుమూల ప్రాంతమైన ఆసిఫాబాద్‌లో వైద్యం అందుబాటులో ఉండేది కాదని, నేడు రూ.60 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలతో 340 పడకల జిల్లా ఆస్పత్రిని నిర్మించి అన్ని రకాల వైద్యాన్ని అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు.

ఇక్కడ మెడికల్‌ కాలేజీ ఏర్పాటుపై సీఎం కేసీఆర్‌ యోచిస్తున్నారని, త్వరలోనే శుభవార్త వింటారని అన్నారు. టీఎస్‌ఎంఎస్‌ఐ డీసీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎంపీ వెం కటేశ్‌ నేత, ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యే లు,జెడ్పీ చైర్‌పర్సన్లు, కలెక్టర్లు  పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top