TG: తెలంగాణ గ్రూప్-3 పరీక్షల షెడ్యూల్ విడుదల | Telangana Group 3 exam schedule released by TSPSC | Sakshi
Sakshi News home page

TG: తెలంగాణ గ్రూప్-3 పరీక్షల షెడ్యూల్ విడుదల

Oct 30 2024 5:14 PM | Updated on Oct 30 2024 5:25 PM

Telangana Group 3 exam schedule released by TSPSC

హైదరాబాద్‌, సాక్షి: తెలంగాణ గ్రూప్-3 పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. వచ్చేనెల 17, 18 తేదీల్లో గ్రూప్-3 పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. వచ్చేనెల 17న రెండు సెషన్లలో రెండు పేపర్లకు పరీక్ష జరగనుంది. 

17న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మొదటి సెషన్‌లో ఫస్ట్ పేపర్ పరీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి 5:30 వరకు సెకండ్ పేపర్ పరీక్ష జరుగుతుంది. 18న తేదీన పేపర్-3 ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు జరుగుతుంది. 

ఇక.. నవంబర్ 10వ తేదీ నుంచి అభ్యర్థులు హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. అభ్యర్థులు టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement