23 చిత్ర నిర్మాణం చాలా కష్టంతో కూడుకుంది: సౌమ్యామిశ్రా | Special congratulations to the film 23 | Sakshi
Sakshi News home page

23 చిత్ర నిర్మాణం చాలా కష్టంతో కూడుకుంది: సౌమ్యామిశ్రా

Mar 29 2026 10:32 PM | Updated on Mar 29 2026 10:34 PM

Special congratulations to the film 23

2025 సంవత్సరానికి గానూ రాష్ట్రప్రభుత్వం ప్రకటించే గద్దర్ అవార్డ్స్ లో స్పెషల్ జ్యురీ అవార్డు పొందిన 23 (ఇరవై మూడు) చిత్ర బృందానికి  జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్  సౌమ్య మిశ్రా ప్రత్యేక అభినందనలు తెలిపారు.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభకు ఆమె హాజరయ్యారు.ఈ సినిమా నిర్మాణం అత్యంత బాధ్యత, కష్టంతో కూడుకున్నదని ఈ సినిమా  చాలా ప్రభావవంతం గా ఉందని సౌమ్యామిశ్రా అన్నారు.

జైలు జీవితాలను ఇంత వాస్తవికతంగా ఎవరూ తెరమీద చూపించలేదని ది షాషాంక్ రిడెంప్షన్ వంటి గొప్ప చిత్రాల సరసన నిలబడే చిత్రం 23 అని అన్నారు. ఈ సినిమా ఖచ్చితంగా జైలులోని ఖైదీలు చూసేలా ఏర్పాట్లు చేస్తానని తెలిపారు. కొంతమంది ఖైదీలలో మార్పు వచ్చినా అది గొప్పమార్పేనని సౌమ్యామిశ్రా పేర్కొన్నారు. 

అనంతరం దర్శకుడు రాజ్ మాట్లాడుతూ..ఈ చిత్ర ప్రయాణంలో తనకు తోడున్న సభ్యులందరికీ కృతజ్ఞతలని ఈ సినిమా ప్రయాణం చాలా ప్రత్యేకమని తెలిపారు. ఈ సినిమా నిర్మించిన ప్రయోజనం నెరవేరాలంటే జైళ్లలో ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. 23 వంటి సామాజిక దృక్పథం ఉన్న సినిమాలకు ప్రభుత్వం ప్రోత్సాహాలు అందించాలని దర్శకుడు బి. నర్సింగరావు కోరారు. ఈ కార్యక్రమం సినీ ఇండస్ట్రీకి చెందిన ఇతర ప్రముఖులు పాల్గొన్నారు

Advertisement
 
Advertisement
Advertisement