breaking news
23 Iravai Moodu Movie
-
ఓటీటీలో దూసుకెళ్తున్న తెలుగు క్రైమ్ డ్రామా!
చిన్న సినిమాలో ఓటీటీలో దూసుకెళ్తున్నాయి. థియేటర్స్‌లో అంతగా ఆకట్టుకోలేకపోయినా.. ఓటీటీలో మాత్ర సూపర్ హిట్‌గా నిలుస్తున్నాయి. ఆ లిస్ట్‌లోకి ఇప్పుడు 23 మూవీ కూడా చేరింది. మల్లేశం'ఫేం రాజ్ రాచకొండ దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ డ్రామా మే 16న థియేటర్స్‌లో విడుదలై ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇక రీసెంట్గా ఓటీటీలో విడుదలై మంచి వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఒకేసారి మూడు ఓటీటీల్లో ఈ చిత్రం ప్రీమియర్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్‌తో పాటు ఆహా, ఈటీవీ విన్‌లోనూ ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం ట్రెండింగ్‌లో ఉంది. అలాగే ఆహాలో ట్రెండింగ్ అవుతున్న టాప్ 10 సినిమాలో టాప్ 2 ప్లేస్‌లో ఈ చిత్రం ఉంది.23 విషయానికొస్తే..1991లో చిలకలూరిపేటలో జరిగిన బస్సు దహనం సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. సాగర్(తేజ) ఓ పల్లెటూరిలో ఉంటాడు. లోన్ తీసుకుని ఇడ్లీ బండి పెట్టుకోవాలనేది కోరిక. కానీ అప్పు దొరకదు. పొగాకు కూలీ సుశీల(తన్మయి)ని ప్రేమిస్తుంటాడు. పెళ్లి కాకుండానే ఈమెకు ప్రెగ్నెన్సీ వస్తుంది. ఆమెని పెళ్లి చేసుకుని ప్రశాంతంగా జీవించాలంటే డబ్బు కావాలి. దీంతో తన ఫ్రెండ్ దాస్‌తో కలిసి బస్సు దోపిడీ చేయాలని అనుకుంటాడు. కానీ అది అమలు చేసే క్రమంలో ప్రయాణికులు తిరగబడతారు. అనుకోకుండా నిప్పంటుకుని 23 మంది సజీవ దహనం అయిపోతారు. తర్వాత ఏమైంది? కోర్టు ఏం తీర్పు ఇచ్చిందనేదే మిగతా స్టోరీ. -
ఓటీటీలో సడెన్‌గా స్ట్రీమింగ్కు వచ్చేసిన రెండు సినిమాలు
నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో తెరకెక్కిన ‘23’ (23 Movie) మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన చిలకలూరి పేట, చుండూరు, జూబ్లీహిల్స్ కార్ బాంబు పేలుడు సంఘటనల గురించి ఈ సినిమా ఉంటుంది. మే 16న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో ఓవర్సీస్ ప్రేక్షకులకు అందుబాటులో ఉంది. అయితే, తాజాగా భారత్‌లోని యూజర్స్‌కు కూడా చూసేలా మేకర్స్ ఛాన్స్ కల్పించారు.‘మల్లేశం’ (Mallesam) సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపుని తెచ్చుకున్న రాజ్.ఆర్ 23 మూవీని తెరకెక్కించారు. తేజ, తన్మయి ప్రధాన పాత్రలు పోషించారు. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా నిర్మాణంలో స్టూడియో 99 సంస్థ ఈ మూవీని నిర్మించింది. అయితే, ఈ చిత్రం జూన్ 27 నుంచి సడెన్‌గా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. 1991 సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో జరిగిన చుండూరు మారణకాండ ఘటన, 1993లో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన చిలకలూరిపేటలో బస్సు దహనంతో పాటు.. 1997లో హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో జరిగిన కార్ బాంబు దాడి గురించి 23 సినిమాతో తెరపైకి తీసుకొచ్చారు. ఇలా ఈ మూడు ఘటనలలో మరణించిన వారి స్టోరీ ఒకే మాదిరి ముగియగా.. హంతకుల కథ చివరకు ఏమైంది అనే పాయింట్‌తో '23' చిత్రంలో చూపించారు. ఈ మూడు కేసుల్లో నేరం ఒక్కటే అయినప్పటికీ శిక్షల్లో ఎక్కువ తక్కువలు ఎందుకంటూ మన న్యాయ వ్యవస్థని ఈ చిత్రం ప్రశ్నిస్తుంది.ఓటీటీలో ఆర్జీవీ సైకలాజికల్ థ్రిల్లర్ 'శారీ' సినిమాఆర్జీవీ డెన్ నుంచి వచ్చిన కొత్త చిత్రం ‘శారీ’(Saaree Movie ) సుమారు మూడు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీకి రచనా సహకారంతో పాటు నిర్మాణంలోనూ ఆర్జీవీ భాగస్వామ్యం అయ్యాడు. అతని శిష్యుడు గిరి కృష్ణ కమల్ దర్శకత్వం వహించాడు. ఆర్జీవీ, ఆర్వీ ప్రొడక్షన్స్ ఎల్ఎల్ పీ బ్యానర్‌పై ప్రముఖ వ్యాపారవేత్త రవిశంకర్ వర్మ నిర్మించారు. ఏప్రిల్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం లయన్స్ గేట్ ప్లే (Lionsgate Play) ఓటీటీలో తెలుగు వర్షన్ స్ట్రీమింగ్ అవుతుంది. త్వరలో అమెజాన్ ప్రైమ్‌లో కూడా విడుదల కావచ్చని సమాచారం. ఆరాధ్య దేవి, సత్య యాదు జంటగా ఇందులో నటించారు.కథేంటంటే..?ఆరాధ్య దేవి( ఆరాధ్య దేవి) కి చీరలు అంటే చాలా ఇష్టం. కాలేజీ కి కూడా చీరలోనే వెళ్తుంది. చీరలోనే రీల్స్ చేసి ఇన్‌స్టాలో షేర్ చేస్తుంటుంది. ఒక సారి స్నేహితులతో కలిసి బయటికి వెళ్లగా...చీరలో ఉన్న ఆరాధ్య నీ చూసి ఇష్టపడతాడు ఫోటోగ్రాఫర్ కిట్టు(సత్య యాదు). ఆమెను ఫాలో అవుతూ దొంగ చాటున ఫోటోలు తీస్తుంటారు. ఇన్స్టాగ్రామ్ లో చాట్ చేసి ఆమెను ఫోటో షూట్ కి ఒప్పిస్తాడు. అలా ఆమెకి దగ్గరవుతాడు. ఆరాధ్య మాత్రం అతన్ని ఫ్రెండ్ లానే చూస్తుంది. ఫోటో షూట్ టైమ్ లోనే ఆరాధ్య అన్నయ్య రాజు(సాహిల్ సంభ్యాల్)..కిట్టు తో గొడవ పడుతాడు. ఆ తరువాత ఆరాధ్య కిట్టు ను దూరం పెడుతుంది. కిట్టు మాత్రం ఆరాధ్య వెంట పడుతుంటాడు. సైకో లా మారి వేధిస్తుంటాడు. దీంతో ఆరాధ్య ఫ్యామిలీ కిట్టు పై కేసు పెడుతుంది. ఆ తరువాత ఏం జరిగింది? ఆరాధ్యను దక్కించుకునేందుకు సైకో కిట్టు ఏం చేశాడు? చివరకు కిట్టు పీడను ఆరాధ్య ఎలా వదిలించుకుంది అనేదే మిగతా కథ. -
సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన కొత్త తెలుగు సినిమా
'మల్లేశం' సినిమాతో ఆకట్టుకున్న దర్శకుడు రాజ్ రాచకొండ.. తర్వాత హిందీలో ఒకటి చేశారు. రీసెంట్గా '23' అనే తెలుగు మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 1991లో చిలకలూరిపేటలో జరిగిన బస్సు దహనం సంఘటన ఆధారంగా తీసిన ఈ చిత్రం ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది?అంతా కొత్త నటీనటులతో తీసిన '23' సినిమా.. మే 16 థియేటర్లలోకి వచ్చింది. కాకపోతే రెగ్యులర్ మూవీ కాకపోవడంతో ఇది జనాల దృష్టిలో పడకుండానే బిగ్ స్క్రీన్‌పై నుంచి వెళ్లిపోయింది. ఇప్పుడు ఎలాంటి ప్రకటన లేకుండానే ఓవర్సీస్ ఆడియెన్స్ కోసం 23 చిత్రం.. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చింది. త్వరలో మన దగ్గర కూడా స్ట్రీమింగ్ అవుతుంది.(ఇదీ చదవండి: చిరంజీవి తల్లికి తీవ్ర అస్వస్థత!)23 విషయానికొస్తే.. సాగర్(తేజ) ఓ పల్లెటూరిలో ఉంటాడు. లోన్ తీసుకుని ఇడ్లీ బండి పెట్టుకోవాలనేది కోరిక. కానీ అప్పు దొరకదు. పొగాకు కూలీ సుశీల(తన్మయి)ని ప్రేమిస్తుంటాడు. పెళ్లి కాకుండానే ఈమెకు ప్రెగ్నెన్సీ వస్తుంది. ఆమెని పెళ్లి చేసుకుని ప్రశాంతంగా జీవించాలంటే డబ్బు కావాలి. దీంతో తన ఫ్రెండ్ దాస్‌తో కలిసి బస్సు దోపిడీ చేయాలని అనుకుంటాడు. కానీ అది అమలు చేసే క్రమంలో ప్రయాణికులు తిరగబడతారు. అనుకోకుండా నిప్పంటుకుని 23 మంది సజీవ దహనం అయిపోతారు. తర్వాత ఏమైంది? కోర్టు ఏం తీర్పు ఇచ్చిందనేదే మిగతా స్టోరీ.చిలకలూరిపేట బస్సు దహనం సంఘటనతో పాటు 1991 చుండూరు మారణకాండ, 1997లో జూబ్లీహిల్స్ కారు బాంబు ఘటనని కూడా సినిమాలో చూపించారు. హంతకులకి శిక్ష పడటమే న్యాయమైతే, అందరు హంతకులూ ఉరికంబం ఎక్కుతున్నారా? అనే పాయింట్ ఆధారంగా దర్శకుడు ఈ మూవీని తెరకెక్కించాడు. రియలస్టిక్‌గా ఉండే చిత్రం చూద్దామనుకుంటే దీన్ని ప్రయత్నించొచ్చు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)