
సాక్షి, బంజారాహిల్స్: ప్రముఖ గాయని పద్మభూషణ్ డాక్టర్ పి.సుశీల మనవరాలి వివాహ నిశ్చితార్థ వేడుక మంగళవారం శంషాబాద్‌లోని సియారా రిట్రీట్‌లో ఘనంగా జరిగింది. గాయని పి.సుశీల కుమారుడు జయకృష్ణ, సంధ్య దంపతులు గచ్చిబౌలిలో నివాసం ఉంటున్నారు. వారి కుమార్తె శుభశ్రీకి బంజారాహిల్స్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త శ్రీరామ్, రాధిక దంపతుల కుమారుడు వినీత్‌తో నిశ్చాతార్థం జరిగింది. నగరానికి చెందిన పలువురు ప్రముఖులు వేడుకలో పాల్గొన్నారు.
చదవండి: Bappi Lahiri Death: ప్రముఖ గాయకుడు బప్పి లహిరి కన్నుమూత