
బెంగుళూరు: సౌత్ ఇండియా మీడియా అసోసియేషన్ (సీమ) జాతీయ అధ్యక్షులు కె. ఆదినారాయమూర్తి ఆదేశాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర (2025-27) నూతన అధ్యక్షులుగా సౌత్ ఇండియా టైమ్స్ ఎడిటర్ చిలుకు వేణుగోపాల్ రెడ్డి నియమితులయ్యారు.
ఆయన బాధ్యతల్ని సమర్థంగా నిర్వర్తిస్తారని, తెలంగాణ వ్యాప్తంగా 'సీమ' కార్యకలాపాల విస్తరణకు కృషి చేస్తారని ఆశిస్తున్నామని, వివిధ పత్రికలు, టెలివిజన్లలో పనిచేస్తున్న పాత్రికేయులు దైనందిని జీవనంలో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాత్రికేయులకు కల్పిస్తున్న సదుపాయాల్ని వారు విస్తృత స్థాయిలో వినియోగించుకోవటానికి మీరు పాటు పడాలని 'సీమ' ప్రధాన కార్యదర్శి నకిరెకంటి స్వామి ఆకాంక్షించారు. చిలుకు వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకుని వెళ్ళి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని ఆయన అన్నారు.