ఆడే వయసులో ఆగిన గుండె | Seventh class student died of heart attack: Telangana | Sakshi
Sakshi News home page

మంచిర్యాల: గుండెపోటుతో ఏడో తరగతి విద్యార్థిని మృతి

Nov 16 2024 4:26 AM | Updated on Nov 16 2024 7:18 AM

Seventh class student died of heart attack: Telangana

చెన్నూర్‌: ఆడుతూ పాడుతూ తిరుగుతున్న ఆ బాలికను అకస్మాత్తుగా మృత్యువు కబళించింది. గుండెపోటు రూపంలో ఆ కుటుంబంలో విషాదం మిగిల్చింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూర్‌ పట్టణంలోని పద్మనగర్‌ కాలనీలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. 

పద్మనగర్‌ కాలనీకి చెందిన కస్తూరి శ్రీనివాస్, రమాదేవి దంపతులకు ఓ కూతురు, కుమారుడు. కూతురు నివృతి (12) పట్టణంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. శుక్రవారం కార్తీక పౌర్ణమి కావడంతో కుటుంబ సభ్యులు ఆ సందడిలో ఉన్నారు. నివృతి ఆలయానికి వెళ్లేందుకు సి ద్ధం అవుతోన్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలింది. కుటుంబ సభ్యులు గమనించి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

వైద్యులు పరీక్షలు నిర్వహించి గుండెపోటుతో మృతిచెందినట్లు ధ్రువీకరించారు. ‘కార్తీక దీపాలు వెలిగించే ఇంట్లో దీపం లేకుండా చేశావా తల్లీ’ అంటూ తల్లిదండ్రులు రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. 

Advertisement
 
Advertisement
Advertisement