సమోసాలో చిట్టెలుక.. అప్పటికే 130 సమోసాలు..!

సాక్షి, సిద్ధిపేట: ఓ హోటల్‌లో కొన్న సమోసాలో చనిపోయిన చిట్టెలుక బయటపడ్డ ఘటన సిద్దిపేటలోని రాఘవాపూర్‌లో బుధవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అధికం వెంకటస్వామి హోటల్‌లో సమోసాలు కొన్నాడు. తింటున్న క్రమంలో చనిపోయిన ఎలుక వచ్చింది. దీంతో వినియోగదారుడు హోటల్ నిర్వాహకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అక్కడే ఉన్న మరికొంతమంది గొడవకు దిగడంతో నిర్వాహకుడు మళ్లీ ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చూసుకుంటానని చెప్పడంతో గొడవ సర్దుమనిగింది. అప్పటీకే 130 సమోసాలు అమ్మినట్లు నిర్వాహకుడు తెలిపారు.
చదవండి: వెజ్ బిర్యానీలో మాంసం బొక్కలు.. కంగుతిన్న వ్యక్తి ఏం చేశాడంటే..
మరిన్ని వార్తలు :