ఏమిటి ‘రాజా’ ఇది! | Raja Singh Controversy In BJP | Sakshi
Sakshi News home page

ఏమిటి ‘రాజా’ ఇది!

Jun 4 2025 8:34 AM | Updated on Jun 4 2025 2:57 PM

Raja Singh Controversy In BJP

కాషాయంలో రాజాసింగ్‌ కుంపటి 

రోజుకో వారి్నంగ్‌.. నేరుగా అధ్యక్షుడిపైనే వాగ్భాణాలు 

నోటీసులు ఇస్తారనే ప్రచారంతో మరింత ఉధృతంగా విమర్శనాస్త్రాలు

సాక్షి, హైదరాబాద్: రోజుకో వార్నింగ్‌..సొంత పార్టీ నేతలపైనే ఘాటైన విమర్శలు..అమ్ముడు పోతారంటూ ఆరోపణలు..నోటీసులు ఇవ్వడం కాదు..దమ్ముంటే సస్పెండ్‌ చేయండి అంటూ సవాలు..గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ వ్యవహారం రోజురోజుకూ చిలికిచిలికి గాలివానగా మారుతోంది. రాష్ట్ర పార్టీ నాయకత్వానికి కొరకరాని కొయ్యగా తయారయ్యారు. నిత్యం సొంత పార్టీ రాష్త్ర స్థాయి నేతలను లక్ష్యంగా చేసుకుని చేస్తున్న విమర్శలకు రాష్త్ర నాయకత్వం గుర్రుగా ఉంది. నేతలను దొంగలని సంబోధిస్తున్నారు. బీజేపీని బీఆర్‌ఎస్‌కు తాకట్టు పెట్టేస్తారంటూ విమర్శిస్తూ నగరంలో పారీ్టకి కంటిలో నలుసులా తయారయ్యాడు.

 సొంత పార్టీ నేతలు ప్రత్యర్థి పారీ్టల నుంచి ప్యాకేజీలు తీసుకుంటున్నారంటూ ఆరోపిస్తూ పార్టీ పరువు బజారున పడేస్తున్నారు.. ఇదిలా ఉంటే పార్టీలో ఉన్న అగ్ర నేతలు ఈ ఎపిసోడ్‌కు పుల్‌స్టాప్‌ పెట్టాలని భావిస్తున్నారు. కేంద్రంలో పెద్దలతో మాట్లాడి పార్టీ నుంచి సస్పెండ్‌ చేసే దిశగా పావులు కదుపుతున్నారు. దీంతో  పార్టీ క్యాడర్‌ డైలమాలో పడింది. పార్టీ కార్యక్రమాల్లో ఎవరి వెంట నడవాలనేది అంతు చిక్కడం లేదు. మొదటి నుంచి ఆయన ఇదే పంథాను కొనసాగిస్తున్నారు. గతంలో పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. గత ఎన్నికల ముందు సస్పెండ్‌ ఎత్తివేసి, గోషామహల్‌ అభ్యర్థిగా పార్టీ టికెట్‌ ఇచ్చింది. 

ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత కూడా ఆయన తీరులో మార్పు కనిపించలేదు. పార్టీ జిల్లా అధ్యక్ష పదవుల కేటాయింపుల్లోనూ రాష్త్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తన వర్గానికే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. జెండా పట్టి పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి పార్టీ పదవుల్లో స్థానం లభించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ రాయబారం చేసినప్పటికీ తాత్కాలికంగా కొంత సద్దుమణిగిందని అంతా భావించినా, ఇటీవల కాలంలో పరోక్షంగా సంజయ్‌పైనా విమర్శణాస్త్రాలను ఎక్కుపెట్టారు రాజాసింగ్‌. దీంతో గ్రూపు రాజకీయాలు ఉన్న మాట తెలిసిందే అయినా ఓ వర్గం ఓ నాయకుడిని ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండటం గమనార్హం.

 పార్టీ పరంగా అంతర్గత నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదని, ఇప్పటికిప్పుడు రాజాసింగ్‌పై చర్యలు తీసుకునే ఆస్కారం లేని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.  ముఖ్యంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత చిట్‌చాట్‌ అనంతరం జరిగిన పరిణామాల తర్వాత తెలంగాణ బీజేపీపై రాజాసింగ్‌ పలు వ్యాఖ్యలు చేస్తూ రెబల్‌గా మారే ప్రయత్నం చేశారు. పార్టీ లైన్‌ క్రాస్‌ చేసి ఎవరైనా మాట్లాడినా, పార్టీకి కట్టుబడి ఉండకపోతే వారిపై చర్యలు తప్పవని ఇటీవల హైకమాండ్, స్టేట్‌ పార్టీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 

ఈ క్రమంలో దమ్ముంటే సస్పెండ్‌ చేయాల్సిందిగా సవాల్‌ విసురుతూ ఎమ్మెల్యే ప్రెస్‌నోట్‌ విడుదల చేశారు. ఈ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న హైకమాండ్‌.. ఏ క్షణమైనా రాజాసింగ్‌కు షోకాజ్‌ నోటీసులు ఇవ్వడం లేదా, పార్టీ నుంచి సస్పెండ్‌ చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది..  

దమ్ముంటే సస్పెండ్‌ చేయండి: ఎమ్మెల్యే రాజాసింగ్‌ 
దమ్ముంటే బీజేపీ నుంచి నన్ను సస్పెండ్‌ చేయండి అంటూ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. పారీ్టలో దొంగలంతా ఒక్కటయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే జరిగితే మీ అందరి బాగోతాలు బయటపెడతానంటూ హెచ్చరించారు. ఇటీవల కాలంలో ఆయన తీరును నిశితంగా పరిశీలిస్తున్న పార్టీ అధిష్టానం క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేస్తోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. 

ఈ ప్రచారంపై రాజాసింగ్‌ స్పందిస్తూ నోటీసులు ఇవ్వనీ పారీ్టకి ఎవరు నష్టం చస్తున్నారో బయటపెడతా, ఇంటి దొంగలంతా ఒక్కటై బీజేపీని బీఆర్‌ఎస్‌ నాయకలకు తాకట్టు పెడుతున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొంచెం ఎక్కువ ప్యాకేజీ ఇస్తే పార్టీని బీఆర్‌ఎస్‌కు పారీ్టకి తాకట్టు పెడతారంటూ ఆరోపించారు. ప్రస్తుతం ఈ విమర్శలు పారీ్టలో దుమారం రేపుతున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement