
సాక్షి, హైదరాబాద్: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌పై కేసు నమోదైంది. తనను లైంగికంగా వేధించాడని ఓ మహిళ ఆయనపై ఫిర్యాదు చేసింది. దీంతో, పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో కేఏ పాల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల ప్రకారం.. కేఏ పాల్ కంపెనీలో నైట్ షిఫ్టులో పని చేస్తున్న ఓ యువతిపై ఆయన లైంగిక వేధింపులకు పాల్పడినట్టు బాధితురాలు ఆరోపించారు. ఈ క్రమంలో అన్ని వివరాలతో బాధితురాలు.. షీటీమ్స్‌ను ఆశ్రయించారు. ఈ సందర్బంగా వారి వాట్సాప్ మెసేజ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం, పంజాగుట్ట స్టేషన్‌లో కేఏ పాల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.