జేఎన్టీయూ వద్ద ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో మంటలు | Private Bus Catches Fire At Kukatpally JNTU Metro Station | Sakshi
Sakshi News home page

జేఎన్టీయూ వద్ద ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో మంటలు

Published Sat, Jan 7 2023 11:15 PM | Last Updated on Sun, Jan 8 2023 12:06 AM

Private Bus Catches Fire At Kukatpally JNTU Metro Station - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని జేఎన్టీయూ వద్ద శనివారం రాత్రి కావేరీ ట్రావెల్స్‌కు చెందిన బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. జేఎన్టీయూ మెట్రోస్టేషన్‌ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంటలు చెలరేగి క్షణాల్లో బస్సు మొత్తం వ్యాపించాయి. అయితే అప్రమత్తమైన  ప్రయాణికులు వెంటనే బస్సు నుంచి దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. స్థానికులు సమాచారంతో అగ్నిమాపకశాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా బస్సులో మంటలు చెలరేగడానికి కారణాలు తెలియరాలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement