
హైదరాబాద్: కాళేశ్వరం నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టొద్దని కోరుతూ హైకోర్టులో బీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. అసెంబ్లీలో మీడియాతో మాట్లాడిన హరీష్ రావు తాము కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తామంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు భయపడుతున్నదని ప్రశ్నించారు.
ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయనే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి వారు అనుమతినివ్వడం లేదని హరీష్‌రావు ఆరోపించారు. కాళేశ్వరం నివేదికను అసెంబ్లీలో పెట్టొద్దని హరీష్‌రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అసెంబ్లీలో కాళేశ్వరం నివేదికపై చర్చించి, తదుపరి చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని హరీష్‌రావు హైకోర్టుకు దాఖలు చేసిన పిటిషన్‌లో వినతిచేశారు.