కరీంనగర్: కరీంనగర్ ఆర్బీఎల్ బ్యాంకులో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. సుమారు రూ. 130 కోట్ల కుంభకోణం జరిగినట్లు సమాచారం. నకిలీ ఖాతాలు తెరిచి, మ్యూల్ ఖాతాలో డబ్బులు మళ్లింపు జరిగినట్లు తెలుస్తోంది. సైబర్ క్రైమ్, హవాలా జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఈ కుంభకోణం ఘటనకు సంబంధించి పదిమంది అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులోకి తీసుకున్న వారిలో ఆర్బీఎల్ కిసాన్ నగర్ బ్రాంచ్ మేనేజర్‌తో పాటు ఇతర ఉద్యోగులు, కొందరు మధ్యవర్తులు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులపై రాజకీయ నేతల నుంచి ఒత్తిళ్లు వస్తున్నట్లు తెలుస్తోంది.


