
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా భారీగా డ్రగ్స్ దందా వెలుగులోకి వచ్చింది. డ్రగ్స్ ఫ్యాక్టరీ గుట్టురట్టయ్యింది. 30 వేల కోట్లు విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లో తయారు చేస్తున్న డ్రగ్స్‌ను దేశ, విదేశాలను సరఫరా చేస్తున్నట్లు మహారాష్ట్ర పోలీసులు గుర్తించారు. మేడ్చల్ కేంద్రంగా డ్రగ్స్ తయారుచేస్తున్న13 మంది ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మేడ్చల్‌లోని ఎండీ డ్రగ్స్ కంపెనీని పోలీసులు సీజ్ చేశారు. అత్యంత ప్రమాదకరమైన ఎక్స్‌టీసీ, ఎక్స్‌టీసీ మోలీ డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
32 వేల లీటర్ల రా మెటీరియల్‌ను మహారాష్ట్ర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత నెలలో మహారాష్ట్ర పోలీసులకు విదేశీయుడు పట్టుబడ్డాడు. విదేశీయుడు ఇచ్చిన సమాచారంతో మహారాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విదేశీయుడి నుంచి రూ.25 లక్షల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో మేడ్చల్‌లో క్రైమ్ బ్రాంచ్ దాడులు చేసింది. వెయ్యి కిలోల కెమికల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సప్లయర్లు, మాన్యుఫాక్చరర్లు , డిస్ట్రిబ్యూటర్లు కలిసిన భారీ నెట్‌వర్క్‌ని మహారాష్ట్ర పోలీసులు చేధించారు.