ఇదేం విడ్డూరం.. ఊళ్లో లేని వ్యక్తికి కరోనా టీకా!  

Mahabubnagar: Corona Vaccine For A Person Who is Not In the Village - Sakshi

సాక్షి, కోస్గి(మహబూబ్‌నగర్‌) : కరోనా టీకాల పంపిణీ కార్యక్రమం పారదర్శకతపై పలు అనుమానాలు రేకిత్తించే ఓ సంఘటన వెలుగు చూసింది. బాధితుడితోపా టు వైద్యాధికారులను విస్మయానికి గురి చే స్తోంది. ఆ వివరాలు.. పదిహేను రోజులుగా ఇంటింటికీ తిరిగి గుండుమాల్‌ పీహెచ్‌సీ వైద్య సిబ్బంది టీకాలు వేస్తున్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి ఆధార్‌కార్డు వివరాలు ఫోన్‌లో నమోదు చేసి వచ్చిన ఓటీపీ ఆధారంగా సదరు వ్యక్తికి టీకా వేయడంతో ఆన్‌లైన్‌లో నమోదవుతోంది.

ఇదిలా ఉండగా పట్టణంలోని బహార్‌పేటకు చెందిన తిరుపతయ్య నెలక్రితం ముంబై వెళ్లాడు. టీకా తీసుకోని వారిని అక్కడి రైళ్లలో, బస్సుల్లో తిరగనీయకుండా ఆంక్షలు విధించారు. దీంతోపాటు టీకా పంపిణీ కార్యక్రమం కఠినంగా అమలుచేస్తున్నారు. ఈ నేపథ్యంలో సదరు వ్యక్తి ఈనెల 5న టీకా కేంద్రానికి వెళ్లి ఆధార్‌ వివరాలు అందజేశాడు. అయితే 4వ తేదీన గుండుమాల్‌ పీహెచ్‌సీలో టీకా తీసుకున్నట్లు ఆన్‌లైన్‌లో నమోదు చేసిఉంది. ఈ విషయమై వైద్యాధి కారి రాఘవేందర్‌ను వివరణ కోరగా, సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.
చదవండి: చోరీ మామూలే..కానీ ఈ దొంగకు ఓ ప్రత్యేకత ఉంది 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top